హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ దర్శనానికి విచ్చేశారు. కార్యక్రమం తదనంతరం చారిత్రాత్మక కళాశాల అయిన శ్రీ లక్ష్మి నరసింహ సంస్కృత ఆంధ్ర కళాశాలను సందర్శించి కళాశాల ప్రత్యేక గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్కృత ఆంధ్ర కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. ప్రభాకర్ మరియు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్ధులు ప్రొఫెసర్ గారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మెరుగు రాంచందర్, కరుణాకర్, టి. సత్యనారాయణ, శ్రావణ్, మోహన్ సంద రాము, సంతోష్, వజ్ర తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి