పావని... సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఏ.చేసినప్పుడు మా స్టూడెంట్. తర్వాత డాక్టరేట్ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో పూర్తి చేసి డా.పావని అయ్యింది. ఆమె ఆచార్య మృణాళిని గారి దగ్గర పరిశోధన చేసింది. యాదృచ్ఛికంగా ఆ సిద్ధాంత గ్రంథానికి నేనొక ఎడ్యడికేటర్ ని. ఆమెకు వైవా (4 January2021) కి కూడా నన్నే పిలిచారు. ఎక్కువ ప్రశ్నలే అడిగాను. ఆమె సమయస్ఫూర్తితో, చక్కగా సమాధానాలు చెప్పింది. ఆమెలోని ఆ తెలివితేటలు ఆ కమిటీకి బాగా తెలియాలనుకున్నాను. ఆమె సమాధానాలు కమిటీ వారిని సంతృప్తి పరచడమే కాదు, ఆమె జ్ఞానాన్ని గుర్తుంచుకొనేలా చేశాయి. శుభాకాంక్షలు డా. పావని! ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు



1 కామెంట్:
ఆచార్య దేవోభవ, నా ఈ పిహెచ్.డి ప్రయాణంలో మీరు, మీరు బోధించిన సాహిత్య విలువలే నాకు స్ఫూర్తి. పరీక్షల కోసమే కాదు,జీవితానికి సరిపోయే సామాజిక విలువలు వాటిని మరచిపోలేము . నా పర్యవేక్షకురాలైన, ఆచార్య డా.సి.మృణాళిని మేడమ్ గారు నా కెంతో సహాయసహకారాలు అందించి తోడ్పాటు నిచ్చారు. థాంక్యూ సార్ .మీకు నా నమస్సులు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి