"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

02 June, 2021

సెంట్రల్ ‘వర్సిటి తెలుగు శాఖాధిపతిగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

నమస్తే దినపత్రిక, 2.6.2021 సౌజన్యంతో 

ప్రఖ్యాత హెచ్ సి యూ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) తెలుగు శాఖ నూతన అధ్యక్షుడిగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మంగళవారం 1.6.2021 పదవీ బాధ్యతలు స్వీకరించారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య అప్పారావు పొదిలే ఆదేశాల మేరకు సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ విడుదల చేసిన ఉత్తర్వులను అనుసరించి మూడు సంవత్సరాల పాటు  ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధ్యాపక సంఘం అధ్యక్షుడు, తెలుగు అధ్యాపకులు ఆచార్య పిల్లలమర్రి రాములు, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ మాజీ డీన్ ఆచార్య ఎస్ శరత్ జ్యోత్స్నా రాణి, విశ్వవిద్యాలయ యాంటీ డిస్ర్కిమినేషన్ చైర్మన్ , తెలుగు అధ్యాపకులు ఆచార్య ఎం.గోనానాయక్, హెచ్ సి యూ భద్రతా కమిటీ చైర్మన్ ఆచార్య సర్రాజు, సెంటర్ ఫర్ ఎన్డేంజర్డ్ లాంగ్వేజెస్ అండ్ మదర్ లాంగ్వేజెస్ స్టడీస్ అధ్యక్షుడు,  తెలుగు అధ్యాపకులు ఆచార్య పమ్మి పవన్ కుమార్, డిప్యూటి చీఫ్ వార్డెన్, తెలుగు అధ్యాపకులు ఆచార్య డి.విజయలక్ష్మి, దళిత విద్యార్థి సంఘం నాయకులు సుమన్, వేణు, రాణా, అఖిలభారత ఒబిసి విద్యార్థి సంఘం నాయకులు కిరణ్ కుమార్, అరుణ్ కేతన్, అంజయ్య, పవన్, లక్ష్మణ్, పరిశోధకులు రామ్ ప్రసాద్ నలసాని, జి.కృష్ణవేణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్ ఆచార్య వి కృష్ణ, మాజీ తెలుగు శాఖ అధ్యక్షురాలు ఆచార్య జి.అరుణకుమారి, డా.బి.భుజంగరెడ్డి, డా.డి.విజయకుమారి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగు శాఖ మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందనే ఆశాభావాన్ని యూనివర్సిటీ అధ్యాపకులు సంఘం అధ్యక్షుడు ఆచార్య పిల్లలమర్రి రాములు వ్యక్తం చేశారు. తన విధులను విశ్వవిద్యాలయ నియమ నిబంధనలను అనుసరించి విశ్వవిద్యాలయానికి మంచి పేరు వచ్చేలా తనవంతు కృషి చేస్తానని శాఖాధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అన్నారు.

నవతెలంగాణ దినపత్రిక, 2.6.2021 సౌజన్యంతో


ఆంధ్రజ్యోతి దినపత్రిక 2.6.2021 సౌజన్యంతో 





ఈనాడు దినపత్రిక , 2.6.2021 సౌజన్యంతో 

మన తెలంగాణ దినపత్రిక 2.6.2021 సౌజన్యంతో 

సాక్షి దినపత్రిక, 2.6.2021 సౌజన్యంతో 



జనం కోసం దినపత్రిక 2.6.2021 సౌజన్యంతో


గణేష్ దినపత్రిక 2.6.2021 సౌజన్యంతో

భూమిపుత్ర దినపత్రిక, 1.6.2021 సౌజన్యంతో 

 'సాక్షి దినపత్రిక, 3.6.2021





No comments: