సాక్షి దినపత్రిక, 2.5.2021 సౌజన్యంతో...
నమస్తే తెలంగాణ దినపత్రిక, 2.5.2021 సౌజన్యంతో...
నమస్తే తెలంగాణ
దినపత్రిక, 2.5.2021 సౌజన్యంతో...
ఈనాడు దినపత్రిక, 2.5.2021 సౌజన్యంతో...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్ గా ఆచార్య ఎస్.శరత్ జ్యోత్స్నారాణి నుండి ఆచార్య వి.కృష్ణ శనివారం (1.5.2021) బాధ్యతలు స్వీకరించారు.
గత రెండు న్నరేళ్ళ పాటు ఆచార్య ఎస్.శరత్ జ్యోత్స్నారాణి సమర్ధవంతంగా విధులు నిర్వహించారని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆచార్య పిల్లలమర్రి రాములు అన్నారు. అలాగే ఆచార్య వి.కృష్ణ కూడా తమ అనుభవంతో హ్యుమానిటీస్ అభివృద్ధి చేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేసి, ఇరువుర్నీ అభినందించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ సెక్యూరిటీ చైర్మన్, సిడాస్ట్ అధ్యక్షులు ఆచార్య సర్రాజు, తెలుగు శాఖ అధ్యాపకుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, దళిత విద్యార్థి సంఘం నాయకులు సుమన్, వేణు (డియస్ యు, అధ్యక్షుడు) కుమార్ రాజా, వెంకటాద్రి, రమేశ్, రాణా ప్రతాప్ తదితరులు ఇరువురికీ శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఎంతో మూడేళ్లు పాటు సహకరించిన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి, విద్యార్థినీ, విద్యార్థులకు, వైస్ ఛాన్సలర్, ప్రో వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, విశ్వవిద్యాలయ అధికారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కోవిద్ నియమం నిబంధనలను పాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నూతన డీన్ గా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య కృష్ణ అభినందనలు తెలుపుతూ, హ్యుమానిటీస్, యూనివర్సిటీ అభివృద్ధికి తన పరిధిలో తాను అంకితభావంతో విధులు నిర్వహిస్తానని ఆచార్య వి.కృష్ణ చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి