కం.
వందనమార్యా! దార్లా!
సుందరపద్యమ్ములనుచు సూచనలిడుచున్
స్పందించునమీకెల్లర
కందించితి తృప్తిగాను నభివాదములన్
కం.
ఎప్పటికప్పుడు నావగు
తప్పులుసరిదిద్దుచునిక తగువిధముగమీ
రొప్పగుమార్గముచూపుచు
తిప్పలు తొలగింపజేసె ధీశాలీ నిన్
కం.
మరువక నాహృదిలోపల
స్థిరముగనే గుడిని నిల్పి జేసితి మననమ్
మురిసితి మీ సూచనలకు
కరమోడ్చితి నయ్యమీకు గౌరవదార్లా!
- *గోవిందుని గోవర్ధన్*, 4.4.2021
(మిత్రమా...నాపై మీప్రేమకు కృతజ్ఞతలు)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి