తెలుగు శాఖకు చెందిన మొరవపల్లి చంద్రమౌళికి ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిహెచ్.డి.డాక్టరేట్ పట్టాను ప్రకటించింది. చంద్రమౌళి తెలుగు శాఖ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో 'విమర్శకుడిగా కట్టమంచి రామలింగారెడ్డి' అనే అంశంపై ఐదేండ్ల పాటు పరిశోధన చేశారు.
ఈ ఐదేళ్ళ పాటు పరిశోధనకు గానూ న్యూఢిల్లీలోని యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ వారు రీసెర్చ్ ఫెలోషిప్ ఇచ్చారు. సిద్థాంత గ్రంథాన్ని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారికి సమర్పించిన తర్వాత నిపుణుల కమిటీ పరిశీలించింది. కాశీలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ చల్లా శ్రీరామచంద్రమూర్తి పిహెచ్.డి. మౌఖిక పరీక్షను నిర్వహించారు. కట్టమంచివారు 'ముసలమ్మ మరణం' కావ్యంతో తెలుగు సాహిత్యంలో చోటుసాధించుకొని, 'కవిత్వతత్వవిచారం' గ్రంథం ద్వారా తెలుగు సాహిత్యంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని ఆయన ప్రశంసించారు. సాహిత్య విమర్శకుడిగా కట్టమంచి పాశ్చాత్య సాహిత్య ధోరణులతో తెలుగు సాహిత్య విమర్శను శాస్త్రీయంగా మార్చారని పరిశోధకుడు డా.ఎం.చంద్రమౌళి పేర్కొన్నారు.
సెంట్రల్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రకటించడం పట్ల తంబళ్ల పల్లెనియోజక వర్గం ఎమ్మెల్యేపెద్దిరెడ్డిద్వారకనాథరెడ్డి
బి.కొత్తకోట మండల వైఎస్ఆర్ సీపీ రైతు విభాగ అధ్యక్షుడు రవికుమార్ గౌడ్, బీరంగి గ్రామ సర్పంచ్ వెంకటరమణ, తారా ప్రభుత్వ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఎం.మంజుశ్రీ, సెంట్రల్ యూనివర్సిటీ అధ్యాపకులు, తల్లిదండ్రులు భారతి, నర్సింహులు, విద్యార్థులు తదితరులు పరిశోధకుడిని అభినందించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి