"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

27 మార్చి, 2021

ఆంధ్రభాషాభిరంజని కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆచార్య దార్ల (27.3.2021)



తెలుగు భాషా, సాహిత్య సాంస్కృతిక రంగాలలో ఆంధ్రభాషాభిరంజని సంఘం స్థానం విశిష్టమైందనీ, ఈ సంస్థను సమారు 134 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న మద్రాసు క్రైస్తవ కళాశాల, చెన్నైవారు అభినందనీయులని సెంట్రయూనివర్సిటి ( యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్) తెలుగుశాఖ లో ప్రొఫెసర్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రశంసించారు. శనివారం ( 27.3.2021) సాయంత్రం జూమ్ ఆన్ లైన్ కార్యక్రమంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.  మద్రాసు క్రైస్తవ కళాశాల, భాషలశాఖ అధ్యక్షుడు డా శ్రీపురం యజ్ఞశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రభాషాభిరంజని సంఘం 134వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తృత్వం, వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. దీనిలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులను ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అభినందించారు. తెలుగు భాష ప్రధానంగా ఉన్న రాష్ట్రాల్లో తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినంత సులభంగా తెలుగు ప్రధానంగా మాట్లాడని ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించడం కష్టమని, అయినప్పటికీ, తెలుగు భాష పట్ల గల అభిమానంతో తెలుగువాళ్లందరినీ ఒకచోటకు కలిపే కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిర్వహకుల పట్టుదలకు నిదర్శనమని ఆయన అన్నారు. ఆంధ్రభాషాభిరంజని సంఘంలో ఎంతోమంది విశిష్టమైన వ్యక్తులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారని అటువంటి వారిలో కొండా వేంకటప్పయ్య, పోకల లక్ష్మీనరసు, వేదం వేంకటరాయశాస్త్రి, భోగరాజు పట్టాభి సీతారామయ్య, కాశీనాధుని నాగేశ్వరరావు,  న్యాపతి సుబ్బారావు పంతులు, సర్వేపల్లి రాధాకృష్ణన్, కట్టమంచి రామలింగారెడ్డి, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్,  రఘుపతి వేంకటరత్నం నాయుడు, ఆర్కాటు లక్ష్మణస్వామి, రామస్వామి మొదలియార్, బొల్లిన మునిస్వామి నాయుడు, కూర్మా వెంకటరెడ్డి నాయుడు, వివిగిరి అంటే వరాహగిరి వేంకటగిరి,  శ్రీరంగం శ్రీనివాసరావు, నండూరి సుబ్బారావు, కె.ఏ. నీలకంఠశాస్త్రి, సి.టి. కృష్ణమాచారి మొదలైనవారు ఈ ఆంధ్ర భాషాభిరంజని సంఘం లో పాల్గొన్నటువంటి విశిష్ట వ్యక్తులు.
వీరిలో ఒకరిద్దరి గురించి చెప్పుకున్నా ఆంధ్ర భాషాభిరంజని సంఘం నిర్వహించినటువంటి పాత్ర తెలుగు సాహిత్యంలో ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది. కట్టమంచి రామలింగారెడ్డి గారు ఈ కళాశాలల్లోనే చదువుకున్నారు అప్పుడు విద్యార్థిగా ఉన్నప్పుడే ఒక ఉపన్యాసం ఇచ్చారు ఉపన్యాసానికి న్యాయనిర్ణేతలల్లో వేదం వేంకటరాయ శాస్త్రి గారు ఒకరు. కట్టమంచి వారు కళాపూర్ణోదయం మీద ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని వేదం వేంకటరాయ శాస్త్రి గారు కూడా మెచ్చుకున్నారు.  తర్వాత కాలంలో ఆ ఉపన్యాసం మే  కవిత్వ తత్వ విచారం గా పేరు పొందింది. అది తెలుగు సాహిత్య విమర్శ ను ఒక మలుపు తిప్పింది.  లండన్ కు తిరిగి వచ్చి ఆ వ్యాసం ఒక పుస్తకంగా తీసుకు వచ్చి దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు ఆ విధంగా ఆంధ్ర భాషాభిరంజని సంఘం తో తెలుగు సాహిత్య విమర్శకు ఒక విడదీయరాని అనుబంధాన్ని కట్టమంచి రామలింగారెడ్డి గారు ఏర్పరిచారు. 
ఇలా ఒక ఒక సంస్థ నిర్వహించే కార్యక్రమాల ద్వారా గొప్ప గొప్ప ఆవిష్కరణలు వెలువడుతాయనడానికి కట్టమంచి రామలింగారెడ్డి  గారి కవిత్వ తత్వ విచారము ఒక ఉదాహరణ మాత్రమే. కాబట్టి ఈ రోజు నిర్వహించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న టు విద్యార్థులు కూడా భవిష్యత్తులో అంత గొప్ప వారు కావచ్చు. కాబట్టి ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరూ అలా గొప్పవారు కావాలని ఆశీర్వదిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
ఈ రోజు కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ గారు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఆయన ఎంతో మంది కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సముచితంగా అనిపిస్తుంది. ఒక సినిమాలో రచయిత చిత్రకారుడు శిల్పకారుడు సంగీతం ఇలా రక రకాల ఇటువంటి కళాకారుల యొక్క పాత్ర ఉంటుంది.  వాళ్ళందర్నీ పోషించేది నిర్మాతే. కాబట్టి నిర్మాత కళాపోషకుడవుతాడు. కాట్రగడ్డ ప్రసాద్ గారు అనేక సినిమాలు తీశారు అనేక మంది గొప్ప గొప్ప కళాకారుల్ని ప్రోత్సహించారు. దీనికి కారణం ఆయన గొప్ప కళాపోషకుడు కావటమే. ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ ఎస్. యజ్ఞశేఖర్ గారికి, మిగతా సభ్యులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను.


అలాగే ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టువంటి పెద్దలకు, మిగతా వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని వివిధ బహుమతులు పొందిన వారందరికీ మాత్రమే కాకుండా, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నానని ఆయన అన్నారు. 

కామెంట్‌లు లేవు: