ఆచార్య సి ఆనందారామం తెలుగు శాఖ, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో పని చేసి పదవీ విరమణ పొందారు.ఆమె ఫిబ్రవరి 10 , 2021వ తేదీన అర్థరాత్రి స్వగృహంలో గుండెపోటుతో మరణించారు.
ఆమె ప్రముఖ నవలా రచయిత్రి, మంచి కథలు కూడా రాసేవారు. ఆమె ప్రాగ్రూపాలు గురించి ఒక మంచి విమర్శ గ్రంధాన్ని వ్రాసారు. అలాగే నవలా సాహిత్యం గురించి మంచి గ్రంథాలు రాశారు. నవలా సాహిత్యం మీద పట్టున్నటువంటి వ్యక్తి.
ఆమె రాసిన జాగృతి అనే నవల సినిమాగా కూడా తీసారు.
వారి మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటు. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ విద్యార్థులకు చాలా బాధాకరం.. నాకు పాఠాలు చెప్పిన టీచర్ మరణించారంటే చాలా బాధనిపిస్తుంది వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తెలియజేస్తున్నాను...ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం 11 2 20 21.
సినిమా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి