ప్రముఖ రచయిత్రి, హెచ్ సి యూ తెలుగు శాఖ పూర్వ ఆచార్యులు సి.ఆనందారామం మరణం తెలుగు సాహిత్యానికి, సెంట్రల్ యూనివర్సిటీ కి తీరని లోటని మానవీయ శాస్త్రాల విభాగం డీన్ ఆచార్య ఎస్.శరత్ జ్యోత్స్నారాణి అన్నారు.
హెచ్ సి యూ స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం తెలుగు శాఖ పక్షాన ఆచార్య ఆనందారామం సంతాపసభ జరిగింది. ఆనందారామం గారితో తమకున్న అనుబంధాన్ని, ఆమె సాహిత్య కృషిని గుర్తుచేసుకున్నారు. ఈ సంతాపసభలో తెలుగు శాఖ అధ్యక్షురాలు ఆచార్య జి.అరుణకుమారి, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య ఎం.గోనానాయిక్, ఆచార్య ఎండ్లూరి సుధాకర్, ఆచార్య డి.విజయలక్ష్మి, డా.బి.భుజంగరెడ్డి తదితరులు పాల్గొని ఘన నివాళి అర్పించారు.
ఆంంంం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి