స్వీయానుభవాల ద్వారా వాస్తవిక సమాజాన్ని తెలుసుకొని, సమాజంలో నిరాదరణకు గురవుతున్న ప్రజల పక్షాన నిలబడిన మేధావి.
సామాన్య ప్రజలకు కూడా ఓటుహక్కు కల్పించి, రాజ్యాధికారానికి వచ్చేవారిని నిర్ణయించే శక్తిని కలిగించిన రాజనీతిజ్ఞుడు.
ప్రపంచంలోని అనేక రాజ్యాంగాల్ని పరిశీలించి సమాఖ్య వ్యవస్థ ఉత్తమమని దాన్ని బలపరిచి, కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య అధికార సమన్వయాన్ని కుదిర్చి జాతీయ సమగ్రతకు పటిష్టమైన బంధాన్ని ఏర్పాటు చేశాడు.
అధికార వికేంద్రీకరణకు అంబేద్కర్ వేసిన బీజాలు ప్రాంతీయ అసమానతలకు అవకాశం లేకుండా చేసే దార్శనిక ఆలోచనలు.
అంబేద్కర్ అనగానే రిజర్వేషన్లు గురించి మాత్రమే మాట్లాడుతుంటారు.
కానీ, స్త్రీల హక్కుల కోసం, ముఖ్యంగా సతీసహగమన నిరోధానికి చేసిన కృషి అమోఘం.
కార్మికులకు సెలవుల కోసం, వారికి ఉండాల్సిన భద్రతల గురించి ఆయన చేసిన కృషి ఆయన రచనలు చదివితే తెలుస్తుంది.
సంస్కృత సాహిత్యాన్ని చదివి వేదాలు, రామాయణ, మహాభారతాల్లోని అనేకసమస్యలు... ముఖ్యంగా వర్ణవ్యవస్థలోని అసంబద్దతను శాస్త్రీయంగా విశ్లేషించారు.
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 6.12.2020
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి