"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

04 December, 2020

ప్రముఖసాహితీవేత్త జి.లక్ష్మీనరసయ్య గారి ప్రత్యేక ప్రసంగం

 దళిత సాహిత్య విమర్శ ధోరణలను అర్థం చేసుకోవడానికి దేశీయ మార్క్సిజంలో అంబేద్కర్సజాన్ని , అంబేద్కర్సజంలో మార్క్సిజాన్ని కలుపుకోడమే దేశియ దళిత సాహిత్యంగా  ప్రముఖ సాహిత్య విమర్శకుడు జి.లక్ష్మీనరసయ్య వ్యాఖ్యానించారు.

సాక్షి, 4.12.2020 సౌజన్యంతో...


‌హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ వారు విద్యార్థుల అంతర్జాపాఠ్యాంశాల్లో  భాగంగా గురువారం (3.12.2020) సాయంత్రం   ప్రముఖ సాహితీవేత్త  జి.లక్ష్మినరసయ్యగారి 'నేను నా సాహిత్య ప్రస్థానం -సమకాలీన దళిత సాహిత్య విమర్శ ధోరణలపై  ప్రత్యేక ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆచార్య పిల్లల మర్రి రాములు, ఆచార్య వెలమల సిమ్మన్న , ఆచార్య సి.శ్రీరామ చంద్రమూర్తి,డా అరుణ గ్రంథం పరిశోధక విద్యార్థులు చంద్రమౌళి, రాంప్రసాద్,పుష్పిణి, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గోన్నారు.
మాట్లాడుతున్న జి.లక్ష్మీనరసయ్యగారు
' అంబేద్కరిజమే దళిత తాత్విక పునాది '
 మార్క్స్  జంలో  అంబేద్కరిజం, అంబేద్కరిజంలో మార్క్సిజాన్ని చూడడమే దేశీయ మార్క్సిజం అని ప్రముఖ సాహిత్య విమర్శకుడు గుంటూరు లక్ష్మి నరసమ్య వ్యాఖ్యానించారు.  గురువారం( 3-12-2020) సాయంత్రం తెలుగుశాఖ సెంట్రల్ యూనివర్సిటీ  (హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం) వారు గూగుల్ మీట్ ద్వారా ' నేను నా జీవిత ప్రస్థానం సమకాలీన దళిత సాహిత్య విమర్శ ధోరణలు ' అనే అంశంపై ప్రత్యేక ప్రసంగం చేశారు.  విద్యార్థుల అంతర్జాల  పాఠ్యాంశాల్లో భాగంగా ఈ ప్రత్యేక ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు.
           ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దళిత సాహిత్యానికి  ఒక శక్తిని అందించేలా సాహిత్య విమర్శ చేసిన లక్ష్మి నరసయ్యగారి కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన జీవిత ప్రస్థానాన్ని (పవర్ పాయింట్ ప్రజెంటేషన్) ద్వారా వివరించారు.తెలుగు  సాహిత్య విమర్శలను పరిచయం చేయడంలో భాగంగా ఈ ప్రత్యేక ప్రసంగాన్ని ఏర్పాటు చేసినట్లు  దార్ల వెంకటేశ్వరరావు వివరించారు. 
  తన ప్రత్యేక ప్రసంగాన్ని కొనసాగిస్తూ జి లక్ష్మి నరసయ్యగారి ఇంత వరకు తెలియని అనేక కొత్త విషయాలను ఆయన వివరించారు. తాను మంగలి కులానికి చెందినావాడినని తనతో చదువుకున్న వారికే తాను క్షవరం చేశానని కొన్నాళ్ళు తన కుల వృత్తి చేశానని ఆయన వివరించారు. మొదటి నుండి తన కుటుంబం కమ్యూనిస్టు భావాలతో ,
చర్చలతో  ఉండేదని ఆ ప్రభావం తనపై పడిందని చెప్పారు. ఆ ప్రభావంతోనే విప్లవ పార్టీలలో పనిచేస్తూ 'వరదయ్య' అనే కలం పేరుతో కవిత్వం రాశానని చెప్పుకున్నారు. కారంచెడు  సంఘటన తర్వాత కమ్యూనిస్టు పార్టీలో వచ్చిన సైద్ధాంతిక విభేదాల వల్ల తను అంబేద్కరిస్టుగా మారానని పూలే, అంబేద్కర్ భావజాలమే దళిత సాహిత్యానికి తాత్త్విక పునాది అని పేర్కొన్నారు.
 త్రిపురనేని శ్రీనివాస్ తో కలిసి 1996 లో 'చిక్కనవుతున్నపాట' అనే దళిత కవిత్వాన్ని తీసుకొచ్చానని అది ఒక సంచలనం సృష్టించిందని ఆయన వివరించారు.తర్వాత 1996లో ' పదునెక్కిన పాట' ప్రచురించిన కమ్యూనిస్టులు దాన్ని సరిగ్గా పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. 1994 నుండి 1999 వరకు తాను రాసిన దళిత కవిత్వ నిర్మాత పద్ధతులు దళిత సాహిత్యంలోని గొప్పదనాన్ని గుర్తించేలా చేశాయని చెప్పారు. కులనిర్మూలన సాధ్యం కావలంటే హిందూ వ్యవస్థ బ్రహ్మాణీయ భావజాలం సమ్మూలంగా నాశనం అయినప్పుడు సాధ్యం అవుతుందని దాని ద్వారా ఒక మంచి సమాజం ఏర్పడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాయలసీమ విశ్వవిద్యాలయం తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ డా అరుణ గ్రంథం మాట్లాడుతూ తాను దళిత సాహిత్యంలోని అలంకారికతపై పరిశోధన చేశానని ఆ సందర్భంగా లక్ష్మి నరసయ్యగారి పి కలిశానని అయన రాసిన వ్యాసాలు, కవిత్వ నిర్మాణ పద్ధతుల పేరుతో తాను డా, రవీంద్ర బాబు సంపాదకులుగా పుస్తకం తీసుకొచ్చామని అది దళిత సాహిత్యాన్ని అవగాహన చేసుకొనడానికి పాశ్చ , పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతాలతో సమన్వయించడానికి ఎంతగానో తోడ్పడతాయని ఆమే  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న, కాశీ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ చల్లా శ్రీరామచంద్రమూర్తి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ పిల్లల మర్రి రాములు అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ డా,కాకాని సుధాకర్ , పరిశోధక విద్యార్థులు చంద్రమౌళి, రాంప్రసాద్, పుష్పిణీ , విద్యార్థిని, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గోన్నారు.
                    
                        రిపోర్టర్
       హైదరాబాద్ విశ్వవిద్యాలయం
                పరిశోధక విద్యార్థి 
               నలసాని రాంప్రసాద్ .





No comments: