గత మూడు రోజులుగా (19.10.2020 to 21.10.2020) జరుగుతున్న ఎం.ఫిల్, పి హెచ్. డీ. తెలుగు ప్రవేశాల కోసం ఇంటర్వ్యూలు ఈరోజుతో పూర్తయ్యాయి.
తెలుగు శాఖ అధ్యాపకులు అడ్మిషన్ కమిటీలో మెంబర్స్ గా ఉన్నారు. తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య జి.అరుణ కుమారి ఈ కమిటీకి ఛైర్ పర్సన్ గా ఉన్నారు. అంతర్జాలంలో జరిగిన ఈ ఇంటర్వ్యూ లకు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సాంకేతిక సహకారం ఇతర అంశాలను చూడడానికి కోఆర్డినేటర్ గా సహకారాన్ని అందించారు. గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్నెట్ అనేక సమస్యలు సృష్టించినప్పటికీ అభ్యర్థులు అంతర్జాలం ద్వారా హాజరయ్యారు. అంతర్జాలం ద్వారా జరిగిన ఈ ఇంటర్వ్యూల్లో అనేక సార్లు 'మీకు వినిపిస్తుందా?' అని మేము- మీకు వినిపిస్తుందా అని అభ్యర్థులు ఒకరినొకరు చెప్పుకోవడం బలే వింతగా అనిపించేది. సాధ్యమైనంత వరకు యూనివర్సిటీలో ఇంటర్నెట్ సమస్య రాలేదు కానీ, స్పీకర్స్ సరిగ్గా పనిచేసేవి కాదు.మిగతా అన్నీ బాగానే జరిగాయి. మొదటి సారి ఇంటర్వ్యూలన్నీ రికార్డు చేశారు. గూగుల్ మీట్ ద్వారా ఈ ఇంటర్వ్యూలు జరిగాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి