"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

17 అక్టోబర్, 2020

ముత్యాల రఘుపతి గారి ‘‘ముత్యాల కైతికాలు’’ పుస్తకావిష్కరణ 17.10.20120

సాహిత్యం ద్వారా కూడా సమాజంలో వివిధ సమస్యల పట్ల ఆలోచించేలా చేయవచ్చునని, సామాన్య ప్రజలను కూడా చైతన్య పరుస్తూ కవిత్వం రాసిన కవి ముత్యాల రఘుపతి అని  సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ముత్యాలు రఘుపతి రాసిన 'ముత్యాల కైతికాలు' గ్రంథావిష్కరణను శనివారం సాయంత్రం అంతర్జాల వేదిక ద్వారా వరంగల్ అర్బన్ జిల్లా భువన సాహిత్య విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. జక్కు కృష్ణ మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సాహిత్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని, గ్రంథాన్ని ఆవిష్కరించిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముత్యాల రఘుపతి అభ్యుదయ దృక్పథంతో, సామాజిక ప్రయోజనాన్ని ఆకాంక్షిస్తూ కైతికాలు రాశారని వివరించారు. రఘుపతి గారి కవిత్వంలో కొన్ని చోట్ల బయోగ్రాఫికల్ స్టైల్ కనిపిస్తుందని, అటువంటి ఖండికలు భవిష్యత్తులో పాఠశాల స్ధాయిలో విద్యార్థులకు పాఠ్యాంశాలయ్యే అవకాశం ఉందని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.
 ఈనాడు దినపత్రిక 19.10.2020 సౌజన్యంతో


గాంధీ, అంబేద్కర్ ల గురించి రాసిన కైతికాల్లో ఈ శైలిని చూడొచ్చని సోదాహరణంగా ఆయన  వివరించారు. పాలపిట్టను చూస్తే మంచిదనుకోవడం ఒక మూఢవిశ్వాసమని, అన్ని పక్షులూ విలువైనవేనని అనడం ద్వారా సాహిత్యం శాస్త్రీయంగా ఆలోచించేలా చేయాలనే కవిత ప్రగతిశీల భావాలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
                                   సాక్షి దినపత్రిక 19.10.2020 సౌజన్యంతో
తన కవిత్వం పేదల, పీడితుల కోసమని రఘుపతి ముత్యాలు గారు స్పష్టంగా ప్రకటించారని వివిధ కైతికాలను ఆయన విశ్లేషించారు. ఆడపిల్లల్ని చదివిస్తూ, వాళ్ళలో శక్తిసామర్థ్యాలను ప్రోత్సహించే విధంగా వస్తువులో, శిల్పంలో నవ్యత్వాన్ని ప్రదర్శిస్తూ  రఘుపతి ముత్యాలు కవిత్వం రాశారని ఆయన ప్రశంసించారు. పుస్తకాన్ని బాగా సమీక్షించిన  గోస్కుల లత రమేశ్,  గడ్డం శంకర్ లను అభినందించారు. కైతికాల సృష్టికర్త గోస్కుల రమేశ్ ఒక  సాహిత్య ఉద్యమకారుడిలా కైతికాల కవిత్వ రూపానికి నాయకత్వం వహిస్తూ అనేకమంది చేత కైతికాల రాయిస్తున్నందుకు  ఆయన్ని కూడా అభినందించారు.
 జనం సాక్షి దినపత్రిక 19.10.2020 సౌజన్యంతో


 కైతికాలకు సాహిత్య చరిత్రలో ఒక సుస్థిరస్థానం కోసం మరింత మంచికవిత్వం రాయాలన్నారు. ఈ కార్యక్రమంలో కవులు, సాహితీవేత్తలు ముత్యాల రఘుపతి, ఈటెల సమ్మన్న, గోస్కుల రమేశ్, మంచికట్ల శ్రీనివాస్, కె.బి.ధర్మప్రకాశ్, వడ్డెబోయిన శ్రీనివాస్, గుండెబోయిన శ్రీనివాస్, నన్నెబోయిన తిరుపతి, వలబోజు సోమేశ్వరరావు, తాళ్ళ సత్య నారాయణ, ఐతా శ్రీనివాస్, పాత అశోక్,  పలువురు కవులు, సాహితీ వేత్తలూ పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న కవులు, సాహితీవేత్తలు
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 


సూర్య దినపత్రిక 19.10.2020 సౌజన్యంతో
నిదానం పత్రిక సౌజన్యంతో






 

2 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

your valuable speech more motivational for us sir

Unknown చెప్పారు...

గౌరవనీయులు ప్రొఫెసర్ డా:శ్రీ దార్ల వెంకటేశ్వర్ రావు గారికి వందనాలు.కవిత్వానికి ఎల్లలు లేవని,సాహిత్యమంటే చేయి తిరిగిన మహాకవులు రాసిందే కాదని,భావుకత ఉంటే ముఖ పరిచయంతో సంబంధంలేకుండా అపరిచితులలో దాగి ఉన్న నిగూఢమైన సాహిత్యం ఏ ప్రక్రియలో ఉన్నా నిరభ్యంతరంగా ఆస్వాదించవచ్చునని నిరూపించారు.మీలాంటి గొప్పవారు మాలాంటివారి తొలి అడుగుల సాహిత్యం పట్ల ఇంత గొప్పగా స్పందించి మాలో కొండంత ఆత్మవిశ్వాసం నింపిన మీ ఉన్నతమైన ఆశయాలు,ఆలోచనలు,ఆదర్శ భావజాలం నా తోపాటు ప్రతీ ఒక్కరిలో స్ఫూర్తిని కల్గిస్తుంది.సామాన్యుల కవిత్వానికి బాసటగా నిలబడిన మీ ఔన్నత్యానికి నేను సదా కృతజ్ఞుడను.
ధన్యవాదాలు సార్.