మాయగాళ్ళు
!
నేనేమో
అగ్ని కణికల్ని కప్పుకొని ఇంటికొస్తాను
నువ్వేమో
నగుమోముతో నాలుగు సిరినవ్వుల
వెన్నెల ముద్దులతో ఎదురొస్తావు
అంతే
ఏమైపోతాయో ఈ మంటలన్నీ!
అంతే
ఎలా పోతుందో ఈ అలసటంతా !
ఈ పసిపిల్లలంతా
బయకు కనపడరు గానీ
బలే మాయగాళ్ళు!
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 9.9.2020
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి