Date : 29-08-2020
గౌరవ నీయులైన ఆచార్య దార్ల వెంకటేశ్వర రావ్
ప్రొఫెసర్
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం
గారికి ,
తన్నీరు సురేష్ గారి ద్వారా మేము చేసిన మా ఆహ్వానము ను మన్నించినందుకు ధన్యవాదములు .
2014 నుంచి మేము దేశభక్తి కార్యక్రమాలు చేస్తున్నాము.
చాలా సార్లు సొంతంగా , కొన్నిసార్లు వివిధ సంఘాలతో, విద్య సంస్థలతో కలిసి కార్యక్రమాలు చేస్తున్నాము .
మా " దేశభక్తుల సంక్షేమ సంఘం ఒక రాజకీయ పార్టీకి గాని , మత సంఘాలతో సంబంధం ఉన్నది కాదు.
ఈ సంఘం అధ్యాపకులు , రిటైర్ అధ్యాపకులతో ఏర్పాటు చేయబడ్డ సంఘం మాత్రమే .
ఏ రాజకీయ, మత పరమైన సంబంధాలు మాకు లేవు.
మా సంఘం సాహిత్య లక్ష్యాల్లో " 10,000 దేశభక్తి గీతాల, కవితల సంకలనం " తయారుచేయడం ముఖ్యమైనది.
అన్ని భారతీయ బాషలలో 10,000 రచనలు కవుల నుంచి స్వీకరించడం లక్ష్యం.
ఇప్పటి వరకు తెలుగు బాష లో 1000 కి పైగా రచనలు కవుల నుంచి స్వీకరించడం జరిగింది.
విద్యార్థులకు ఖర్చు లేకుండా మా పుస్తకాలు చేరాలనే ఉద్దేశ్యం తో ఎక్కువ శాతం ఈ -పుస్తకాలు రూపకల్పన చేయడం జరిగింది.
మా బ్లాగ్ లింక్
www.patriotswelfaresociety.
ప్రస్తుత కవి సమ్మేళనం మే 7,2020 న కరీంనగర్ తో నిర్వహించాలని భావించాము.
కానీ కరోనా కారణంగా వీలు కాక ఆన్లైన్ కవి సమ్మేళనం చేస్తున్నాము. మీ వంటి సాహితి దిగ్గజాలు మా కవి సమ్మేళనం కు ముఖ్య అతిధిగా రావడం అదృష్టంగా భావిస్తున్నాము .
ధన్యవాదములు
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షులు
దేశభక్తుల సంక్షేమ సంఘం , మంచిర్యాల
( అన్ని సాహితీ సంస్థల తరుపున )
1 కామెంట్:
Best movies website telugnetflix
కామెంట్‌ను పోస్ట్ చేయండి