భారతరత్న మదర్ థెరీసా జన్మదిన వేడుకలు
'సమాజసేవకు నిలువెత్తు ప్రతీక మదర్ థెరీసా'
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఉద్ఘాటన
సమాజంలో నిరాశ్రయులైన వారెందరికో ఆశ్రయం కల్పించి, మానసికంగాను, భౌతికంగా చేయూతనిచ్చిన మదర్ థెరీసా సమాజసేవకు నిలువెత్తు ప్రతీక అని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం చందానగర్ లో గల సూపర్ విజ్ కళాశాల లో మదర్ థెరీసా జయంతోత్సవం, సేవారత్న పురస్కారాల ప్రదానోత్సవ సభ జరిగింది.ఈ సభలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మదర్ థెరీసా స్ఫూర్తితో భారతదేశం, ప్రపంచ వ్యాప్తంగా సుమారు 123 దేశాల్లో సమాజసేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన అన్నారు. సమావేశానికి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అధ్యక్షత వహించారు. నిష్కళంకమైన సేవాతత్పరురాలు మదర్ థెరీసాను గుర్తు చేసుకుంటూ, ఆమె జన్మదినం సందర్భంగా సమాజంలో ఆయా రంగాల్లో విశేషమైన సేవ చేసిన వ్యక్తులకు మదర్ థెరీసా సేవారత్న పురస్కారాలను ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ యేడాది కూడా పలు స్వచ్చంధ సేవాసంస్థల సహకారంతో వివిధ సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్రావు, శ్రీమతి శ్వేతి, కొండా విజయకుమార్, గుడ్ల ధనలక్ష్మి గార్లకు మదర్ థెరీసా సేవారత్న పురస్కారాలను ప్రదానం చేశారు. పూలరంగనాయకమ్మ ట్రస్టు చైర్మన్ శ్రీకోటేశ్వరరావు, స్వేచ్ఛా కిరణం సెక్రటరీ బాబ్జీ చౌదరి లకు ఆత్మీయ సత్కారం చేశారు. పురస్కార గ్రహీతలను దుశ్శాలువ, పూలమాల, జ్జాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో డా.బి.సి.రామన్న, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రామ్మోహన్ రావు, శివరామకృష్ణ, జనార్ధన్, ఎమ్మెస్ నారాయణ,శ్రీమతి విజయలక్ష్మి, శ్రీమతి రజని, జి.వి.రావు, డి.వి.కృష్ణారావు, పాలెం శ్రీను తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి