"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

29 July, 2020

ది.29.7.2020 న జరిగిన అంతర్జాల ప్రారంభ సమావేశంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు స్వాగత వచనాలు


·         అందరికీ నమస్కారం
·         యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ నిరంతరం విద్యార్థులు, పరిశోధకుల జ్ఞానాభివృద్ధికి కావలసిన మార్గాలను అన్వేషిస్తుంది. కరోనా కష్ట సమయంలో కూడా విద్యార్థులు, పరిశోధకులతో అధ్యాపకులు అందుబాటులో ఉంటూ వివిధ మార్గాల ద్వారా పరిశోధనలు కొనసాగిస్తున్నారు.
·         దీనిలో భాగంగానే తెలుగుశాఖ, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ వారు తెలుగు అకాడమీ వారితో కలిసి రెండు రోజుల పాటు ‘జ్ఞాన సముపార్జన మాధ్యమం-మాతృభాష’ అనే అంశంపై ‘అంతర్జాతీయ అంతర్జాల సదస్సు’ ని నిర్వహించాలనుకున్నాం.
·          మా యూనివర్సిటి వైస్ ఛాన్సలర్ ఆచార్య పొదిలి అప్పారావుగారి అనుమతితో, వివిధ ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ, అంతర్జాలం ద్వారా ఈ సదస్సుని నిర్వహించాలనుకుంటున్నాం. 

·         ఆచార్య పొదిలి అప్పారావుగారు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా వచ్చిన నాటి నుండి నేటి వరకూ యూనివర్సిటి అభివృద్ధిలో కీలకమైన పాత్రను నిర్వహిస్తున్నారు.
·         ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ఉన్నత విద్యాసంస్థలతో పోటీ పడేటట్లుగా విద్యార్థులు, అధ్యాపకుల సమన్వయంతో యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ ఉత్తమ ర్యాంకింగ్ పొందడానికి విశేషమైన కృషి చేస్తున్నారు.
·         దీని ఫలితంగానే యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ 2019 లో  Institution of Eminence (IoE) హోదాను కూడా సాధించింది.
·         మరొక వైపు ఆచార్య పొదిలి అప్పారావు గారు వ్యక్తిగతంగా తాను విశేషంగా పరిశోధనలు చేస్తూ అత్యుత్తమ ఫలితాల్ని కూడా సాధిస్తున్నారు. 2017లో భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్రమోడీ గారి చేతుల మీదుగా the Millennium Plaques of Honour for his achievements in Life Sciences అవార్డు తీసుకున్నారు.  
·         అటువంటి  ఆచార్య పొదిలి అప్పారావుగార్ని మా తెలుగుశాఖ పక్షాన ఈ సదస్సుకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వీరిని ఈ ప్రారంభోత్సవ సమావేశానికి అధ్యక్షత వహించవలసినదిగా కోరుతున్నాను.
·         మాన్య శ్రీ గౌ. ఎం.వెంకయ్యనాయుడు గారు, మన భారతదేశ ఉపరాష్ట్రపతి గార్కి నమస్కారం. వీరు  మన తెలుగు వారు కావడం, భారతదేశానికి అత్యున్నత పదవిలో వారు ఉండటం మనమంతా గర్వించదగిన విషయం. విద్యార్థి నాయకుడి నుండి శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా ఆయన అనేక పదవులను చేపట్టారు. ఆయన ఆ పదవులకే వన్నె తెచ్చారు. వారి అమ్మాయి నిర్వహిస్తున్న స్వర్ణ భారతి ట్రస్టు ద్వారా వేలాది మంది పేదవాళ్లు, నిరుద్యోగులు ఉపాధి పొందుతున్నారు.  ఆయన బహుభాషా కోవిదులు. ఆయన ఏ భాష మాట్లాడినా ఆ భాషకి ఒక గొప్ప గౌరవం ఏర్పడుతుంది. అంత గొప్ప భాషా నైపుణ్యం గల ఆయన మాతృభాషలకు అత్యధిక ప్రాధాన్యాన్నిస్తూనే, భారతీయ సమైక్యతకు  దోహదపడే భాషలను విస్మరించకూడదంటారు. తెలుగు భాషలో ఆయన మాట్లాడుతుంటే, తెలుగు భాషకు ఇంత తీయదనం, ఇంత గొప్పతనం ఉందా అనిపిస్తుంది.
·         భారతదేశానికి ఉపరాష్ట్రపతి అయినప్పటికీ ఆయన అప్పుడప్పుడూ తెలుగు పత్రికల ఎడిటోరియల్ పేజీల్లో వ్యాసాలు రాస్తుంటారు. తెలుగు భాష పట్ల ఆయనకు అంత అభిమానం.
·         ‘జ్ఞాన సముపార్జన మాధ్యమం-మాతృభాష’ అనే అంశంపై అంతర్జాల సదస్సుని నిర్వహిస్తున్నామని తెలిసి, వారికి నిరంతరం ఎన్ని పనులు ఉన్నప్పటికీ దీనికి వారు ముఖ్య అతిథిగా అంగీకరించడం ఈ సదస్సుకి గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. వారికి యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేయవలసినదిగా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను.


·         ప్రముఖ సైంటిస్ట్ ఉపగ్రహ నావిగేషన్ రిసీవర్లు, హైబ్రిడ్ నావిగేషన్ వ్యవస్థల అభివృద్ధిలో అధునాతన పరికరాలు రూపొందించడంలో విజయవంతమైన ప్రయోగాలు చేసిన, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (The Defence Research and Development Organisation DRDO) చైర్మన్‌, శాస్త్రవేత్త,  రక్షణ మంత్రిత్వశాఖకు శాస్త్ర సాంకేతిక సలహాదారు  డా.జి.సతీష్ రెడ్డి గార్ని గౌరవ అతిథిగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను.
·         హెపటైటిస్‌-బి టీకా ధరను సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చేలోగా కృషి చేసిన  శాంతాబయోటెక్ ఫార్మా కంపినీస్ చైర్మన్, పద్మభూషణ్ గ్రహీత, గొప్ప సాహితీ ప్రియుడు డాక్టర్ కె.ఈ.వరప్రసాదరెడ్డిగార్ని ,
·         ప్రముఖ సాహితీవేత్త, తెలుగు అకాడమి ద్వారా ఉన్నత విద్యాస్థాయిలో కూడా తెలుగు మాధ్యమంలో చదివే విద్యార్థుల కోసం తెలుగు పుస్తకాలను ప్రచురించడంలో ఎంతో శ్రద్ధతీసుకుంటున్న  డైరెక్టర్ శ్రీ ఎ. సత్యనారాయణ రెడ్డి గార్ని ఆత్మీయ అతిథులుగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను.
·         ప్రముఖ సాహితీవేత్త, ఆంధ్రప్రదేశ్ అధికారభాషా సంఘం సభ్యులు, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్, ఆచార్య ఎస్.శరత్ జ్యోత్న్సారాణిగార్ని,
·         ప్రముఖ పరిశోధకురాలు, బహుగ్రంథకర్త తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య జి.అరుణ కుమారిగార్ని ఆత్మీయ అతిథులుగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను.
·         ఈ సమావేశంలో కీలకోపన్యాసం చేయడానికి ప్రముఖ సాహితీవేత్ల ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పూర్వ అధ్యక్షులు, రామాయణంపై సాధికారికమైన పరిశోధన చేసిన వారు, బహుగ్రంథకర్త  ఆచార్య కోలవెన్ను మలయవాసిని గార్ని సమావేశంలో పాల్గొన వలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తు్న్నాను.
·         సదస్సు లక్ష్యాన్ని వివరించడానికి సదస్సుకో ఆర్డినేటర్ ఆచార్య డి.విజయలక్ష్మిగార్ని, వందనసమర్పణ చేయడానికి ఆచార్య పమ్మి పవన్ కుమార్ గార్ని సమావేశంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను.
·       ఈ సదస్సులో పాల్గొనవలసిందిగా తెలుగుశాఖ అధ్యాపకులు,  పత్రసమర్పకులు, పరిశోధకులు, తెలుగు భాషాభిమానలు అందరికీ స్వాగతం పలుకుతూ, సదస్సుని నిర్వహించవలసినదిగా అధ్యక్షులు ఆచార్య పొదిలి అప్పారావుగార్ని అభ్యర్థిస్తున్నాను.
·       నమస్కారం. ధన్యవాదాలు.    

No comments: