"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

28 జులై, 2020

కరోనా సామెతలు...సేకరణ

*సమకాలీన సామెతలు*
కరోనా పేషంటుకి దగ్గులు నేర్పినట్లు.
తమ్ముడు తమ్ముడే...సోషల్ డిస్టెన్సు  సోషల్ డిస్టెన్సే...!
దగ్గయి వంగనిది కరోనా అయి వంగుతుందా...?
వంద చంపులు చంపిన నంగనాచి...చివరికి ఒకటి పడక ఓడిందట.
సర్వేంద్రియాణాం శ్వాసకోసం ప్రధానం.
ఆడలేక మాస్కు మాసిందన్నాట్ట.
బాటిల్లో పోస్తేనే శానిటైజర్ అయినట్లు.
కరోనాకి కొడుకున్నాడు గానీ...పడిశానికి పెద్దన్న లేడు.
అయ్య బజార్లు తిరుగుతుంటే...కొడుకు బాసింపట్టేసుకుని కూకుంటాడా?
పొమ్మనలేక...తుమ్మినట్లు.
గుడి కన్నా బందెలదొడ్డి పదిలం.
పోన్లే పాపమని తొడుక్కోడానికి మాస్కు ఇస్తే....గుడెనక్కి పోయి అరుగు తుడిచాడట.
కరోనా వచ్చినాక కర్చీఫు కోసం వెతుక్కుని ఏం లాభం?
పనిమనిషికి పెత్తనం ఇస్తే శానిటైజర్ తో చెప్పులు తుడిచిందట.
జ్వరం వచ్చినోడెళ్ళి కరోనా వచ్చినోడితో మొఱపెట్టుకున్నాడట.
గోరంత వైరస్ జగమంత ఒణుకు.
దగ్గేవాడికి... కరోనా వచ్చినోడు లోకువ.
తోచీతోచనమ్మ కరోనా వచ్చినోళ్ళతో కబడ్డీ ఆడితే....ఇంకా తోచనమ్మ ఐసోలేషన్ సెంటర్ కెళ్ళి సెల్ఫీ దిగిందట.
చూసి రమ్మంటే అంటించుకుని వచ్చేట్ట.
కరోనా వచ్చిందని ఒకడేడుస్తుంటే .... పేకాటకి ఒక హ్యాండు తగ్గిందని ఇంకోడేడ్చాడట.
చేయి చూసి జాతకం చెప్పే పంతులు... కరోనాతో కడతేరాడట.
కాలు బయటపెట్టనామె కరోనాతో చస్తే..ఇల్లిల్లూ తిరిగినామె గడప తట్టుకుని చచ్చిందట.
ఇదిగో జొరం అంటే...అదిగో కరోనా అన్నట్లు.
ఆసుపత్రికెళ్ళి బరువు చూసుకున్నా... కరోనా అనే అంటారు.
ఇచ్చుకొంటినమ్మ బనానా... పుచ్చుకొంటినమ్మ కరోనా అన్నట్లు.
కరోనా.... సంచార పురుష లక్షణం
మాస్కు (Mask) చేసే మేలు మాస్కు (Mosque) చేయలేదు.
తిరుగుబోతుకి లేని గుట్టు కరోనాకెందుకు?
పోలీసు దెబ్బలు తప్పినా కరోనా దగ్గులు తప్పవు.
కథకు కాళ్ళు లేవు, కరోనాకు కళ్ళు లేవు.
అత్తకు మెత్తన, కరోనాకు మంచీ లేవు.
కరోనా ఏల వచ్చెరా కనకలింగమా అంటే....తిరిగి చెడ్డ ఫలితంరా తిరుపలింగమా అన్నాట్ట.
కరణాన్ని, కరోనా పేషంటుని కాటికి పోయినా నమ్మరాదు.
కాలం, కర్మం కలిసి రాకపోతే కమలబాంధవుడికైనా కరోనా తప్పదు.
ముక్కు వంకర... మాస్కు తీరుస్తుంది.
పిండి కొద్దీ రొట్టె, పుణ్యం కొద్దీ పురుషుడు, తిరుగుడు కొద్దీ కరోనా.
అత్త పోరు, మామ పోరు కరోనా తీర్చిందట.
పూజా పునస్కారాలు లేక కరోనాని ఏమీ చేయలేకపోతున్నాను గానీ....నైవేద్యం పెట్టిచూడు నా మహిమ చూపిస్తానన్నాట్ట.
మొదలే చప్పిడిముక్కు, దానికి తోడు కరోనా...
హోమ్ క్వారంటైన్ కి ఎక్కువ ఐసోలేషన్ సెంటర్ కి తక్కువ.
పంతులుగారి మాస్కు పోయిందని... కరోనా పోయినట్లా?
అంబులెన్సు ఎక్కరా మామా అంటే...విండో సీటయితేనే ఎక్కుతా మావా అన్నాట్ట.
కరోనా కథంతా విని అది కాళ్ళకి వచ్చే జబ్బా అనడిగాట్ట.

కామెంట్‌లు లేవు: