నువ్వు భయాన్నవతలకు విసరేసి
విశ్వాసాన్నంతా పరుచుకొని
నా యెదపై అలా గంతులేస్తుంటే
నీ గొంతు పలికే కేరింతలన్నీ
మా నాన్న కళ్ళ నుండి రాలిపడుతున్న ఆనందభాష్పాలనిపిస్తున్నాయి
నువ్వు నా భుజమ్మీద నిలబడి
నీ రెండు చేతుల్నీ ఆకాశం వైపు చూపిస్తున్నప్పుడల్లా
మళ్ళీ మా నాన్న చేతుల్నే ప్రేమగా తాకుతున్నట్లనిపిస్తుంది
నువ్వు నా ఒడిలో గువ్వలా ఒదిగిపోతున్నప్పుడల్లా
మా నాన్న మా కోసమెలాకరిగిపోయాడంటూ
గుండె గట్టిగా కొట్టుకుంటున్నట్లనిపిస్తుంది
నువ్వు నా చుట్టూ ఆడుకుంటుంటే
మా నాన్నే నాతో ఆడుకుంటున్నట్లనిపిస్తుంది
నాన్నా!
నువ్వు నాకో ఆత్మవిశ్వాసపు ఆకాశం
నువ్వు నాకో నిత్య పరిమళాల ఆనందపు జల్లు
నువ్వు నాకో రంగురంగుల ఇంద్రధనస్సు
నీలోని నేనే
నాలోని నువ్వు
నీతో మళ్ళీ ఆడుకోవడమంటే
నవ్వుల పూదోటలో విహరించడమే!
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 21.06.2020
( ఫాదర్స్ డే సందర్భంగా...)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి