"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

27 మే, 2020

యూనివర్సిటీలో నా మిత్రులు

వీళ్ళిద్దరూ పరిచయం కాకముందు నేనెప్పుడూ *జిల్లెళ్ళమూడి అమ్మవారి* పేరు విన్లేదు.  నిజానికి నాకు వీళ్ళ వల్లే *జిల్లెళ్ళమూడి అమ్మ* వారంటే ఒక గౌరవభావం పెరిగింది. అక్కడ చదువుకొని వచ్చినవారంటే నాకెందుకో ఒకరకమైన అనుబంధాన్ని పెనవేసుకున్నట్టు అనిపిస్తుంది. అక్కడ నుండి వచ్చామని ఏ విద్యార్థయినా చెప్తే నాకు వీళ్ళే గుర్తుకొస్తారు. ఆ వీళ్ళే -ఈశ్వర్- అని ప్రేమగా పిలుచుకొనే వెలగా ఈశ్వరరావు, -ఉమా- అని ఆత్మీయంగా పలకరించుకొనే సముద్రాల లక్ష్మీ వేంకట ఉమా మహేశ్వర రావు. వీళ్ళిద్దరూ *అమ్మవారి* కళాశాలలోనే చదువుకున్నారు. ఇద్దరిలోనూ 'ఈశ్వరత్వం' ఉంది. ఈశ్వరత్వమంటే నాకు నిజంగా మనిషిని ప్రేమించడం. ఈశ్వరత్వమంటే నాకు  తనలాగే తన చుట్టూ ఉన్నవాళ్ళందర్నీ ఇష్టపడ్డం. వాళ్ళలా నాతో ఉండేవారు. ఈశ్వర్ గాడు (ఇలా అనుకోవడమే మాకిష్టం!) నాకు తొలిసారిగా వాల్తేరు లో పరిచయం అయ్యాడు. ఎం.ఏ. తెలుగు ఎంట్రన్స్ పరీక్ష రాసిన తర్వాత పరిచయమైయ్యాడు. పరీక్ష సమయం సగం కూడా కాకుండాపూర్తవ్వకుండా ముందే వచ్చేసినందుకేమో నాకు పరిచయమయ్యాడు. బలే తమాషాగా పరిచయం చేసుకున్నాడులే. ఏమిరాశాడో తెలుసుకుందామన్నట్లు ఎంట్రన్స్ పరీక్షలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అడిగాడు. ''వీడెవడ్రా బాబు... పరీక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో పరీక్ష పెడుతున్నా''డనుకొంటూ, నేను వెయిట్ చేస్తున్న వ్యక్తిని వెతుకుతూ నాకు తెలిసిన సమాధానాలు నేను చెప్తున్నాను. ఈశ్వర్ కళ్ళల్లో నేను మొదట్లో చూసిన వెటకారపు చూపులో మార్పు వచ్చినట్లనిపించింది. నాకు మరింత దగ్గరకొచ్చి ఇంకొన్ని ప్రశ్నలు... (ఈ కథంతా మరోసారి చెప్తాను) ఇలా నాకు పరిచయమైయ్యాడు. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరం క్లాస్మేట్స్ అయ్యాం.  పేరుకి వేర్వేరు రూములైనా కలిసే ఉన్నాం. వీళ్ళు చెప్పే జిల్లెళ్ళమూడి అమ్మవారి ఆచరణ కనిపించేది
నేనెప్పుడూ వీడు నర్మగర్భంగా మాట్లాడ్డం  చూడలేదు. మాటలు చెప్పడం కంటే చేతల్లో చెయ్యడమెలాగో వీడ్ని చూస్తేనే తెలిసింది. ఖర్చు పెట్టడంలో వెనుకంజవేసేవాడుకాదు. మరలా ఇతరులు తనకు పెట్టాలనీ ఎదురుచూసిన రోజుల్నీ నేను చూడలేదు. కొంతమందికి ఎం.ఏ.లో ఫీజులు కట్టుకోవడానికి తనవంతూ సాయం చేసింది కూడా నాకు తెలుసు. ఇవ్వడంలోని ఆనందాన్నే బాగా అనుభవించేవాడనిపించేది.  నాకు కూడా కొన్ని పుస్తకాలు కొనిచ్చాడు. ఇప్పటికీ వాడిచ్చిన ఫైల్లోనే అపురూపంగా నా సర్టిఫికెట్లు దాచుకున్నాను. ఒకే మంచమ్మీద దొర్లాం. ఒకే కంచంలో తిన్నాం. నాకు వాడు *వెలగా ఈశ్వరరావు* కాదు; * వెలుగే ఈశ్వర్*
 ఉమా... మంచి అందగాడే కాదు; అందమైన మనసున్న వాడు. నేను అడ్మిషన్ తీసుకొని, హాస్టల్ రూమ్ కోసం చీఫ్ వార్డెన్ ఆఫీసుకి వెళ్ళాను. అప్పటికే నాకు వీరాస్వామి, జానయ్య, కిరణ్, వెంకయ్య మొదలుగా ప్రొగ్రెస్సివ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ వాళ్ళు అడ్మిషన్ లో సహాయం చేశారు. వాళ్ళు చేసిన సహాయాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. మాకు కాల్ లెటర్ ల్ అడ్మిషన్ పీజులే రాశారు. హాస్టల్ ఫీజులు వివరంగా లేవు. ఆ ఫీజులన్నీ వాళ్ళే కట్టి చేర్పించి, వాళ్ళ హాస్టల్ కి తీసుకెళ్ళి భోజనం కూడా పెట్టించారు. వాళ్ళ సభ్యులే ఒకరు నా కూడా వచ్చి, హాస్టల్ రూమ్ ఇప్పించారు. వాళ్ళు రావడం వల్లనే అనుకుంటా, రూములో ఎవరు కావాలో లిస్టు చూపించి  చెప్పమన్నారు. క్యాంపస్లో ఎవరు చూసినా ఇంగ్లీషే మాట్లాడుతున్నారనిపించింది. మొదట భాషా సమస్య తీరిపోతుందనుకున్నాను. తర్వాత ఇద్దరిదీ ఒకే క్లాసు కావడం వల్ల రూము ఒకేసారి మూసుకొని వెళ్నిపోవచ్చు; మరలా కలిసే రావచ్చనుకున్నాను.  అలా నేను * ఉమా* ని రూమ్మేటుగా ఎంపిక చేసుకున్నాను.
మొదట నేనే రూము లోకి వెళ్ళాను. తర్వాత కొన్నిరోజులు తర్వాత ఉమా వచ్చాడనుకుంటాను. ''మీరెవరో తెలియకపోయినా, తెలుగు సబ్ఖెక్టని నేనే మీపేరు ఈ రూములో రాయించా''నని అన్నాను. 'ఓహో అలాగా' అన్నట్టు చిన్నగా నవ్వుతూ మాట్లాడాడు. కొన్ని రోజుల వరకూ వాళ్ళ సీనియర్ సత్యనారాయణ రూములో ఎక్కువగా గడుపుతుండేవాడు. నాకు యూనివర్సిటీ లో ముందే తెలిసినవాళ్ళెవరూ లేరు. అందువల్ల కొన్నాళ్ళపాటు నాకు పుస్తకాలే నేస్తాలయ్యాయి. క్లాసులవ్వగానే లైబ్రరీయే అతిథి గృహమయ్యేది. ఈలోగా ఈశ్వర్ రావడం, నన్ను తనతో పాటు కలుపుకుపోడంతో క్రమేపీ ఉమా కూడా రూములోనే ఉండేవాడు.
(సశేషం)


కామెంట్‌లు లేవు: