నీకో నిజం చెప్పనా
అది సంతోషమో, అది దుఃఖమో...
ఏదైనా పొంగిపొర్లి కవిత్వమై వస్తున్నా,
దాన్ని అక్షరాల్తో బందిద్ధామనునేంతలోనే
నువ్వు కర్ర పట్టుకుని
నా ఎదుట నిలిచినట్లవుతుంది.
కవిత్వ వేదన నీకు తెలుసు
జీవుని వేదనా నీకు తెలుసు
నువ్వు మాకు దొరికిన తులసిమొక్కవు
నీ చుట్టూ ఉండేవాళ్ళు
నాలుగు కాలాలపాటు సంతోషంగా ఉండాలనుకుంటావు
నువ్వు వెలుగునిస్తూ
చీకటిని సంతోషంగా స్వీకరించగల
గరళకంఠుడివి!
అమ్మతనాన్ని జీవితంలోని కమ్మదనాన్ని
త్యాగం చెయ్యగల నిస్వార్థ ప్రేమమూర్తివి!
నువ్వో కడిగిన ముత్యంరా
నన్ను కవిత్వాన్ని రాయొద్దంటావు.
నేనేమో బెదురు బెదురుగానైనా
బెల్లం ముక్కకి ఆశపడే పిల్లాడ్నైపోతుంటాను.
( మా ఈశ్వర్ కి ప్రేమతో...)
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 4.5.2020
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి