"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

06 మార్చి, 2020

నేనూ-నాదేహం!!


నా దేహమే నాతో పోరాడిందో
నేనే నాదేహంతో  పోరాడానో
నాదేహమే నన్ను సుఖ పెట్టిందో
నేనే నా దేహాన్ని సుఖపెట్టానో
నాకూ నాదేహానికీ
ఇంతకాలంగా కొనసాగిందా ఆ అనుబంధం!
పసివాసనలూ
యౌవన పులకరింతలూ
వృద్ధాప్యపు పలవరింతలూ
సుఖదుఃఖాలన్నింటితోనూ మమేకమైయ్యాం!
నేడు...
నేనే గెలిచానో
నా దేహమే గెలిచిందో
ఒకర్నొకరం మాత్రం శాశ్వతంగా
తూర్పూ-పడమరలైపోయాం!
రేపటి నుండి దానికోసం నేనూ
నాకోసం అదీ ...ఒకర్నొకరం
కృత్రిమంగానో, కృతజ్ఞతగానో
పలకరించుకోనేదెలా?
పరవశించుకుపోయేదెలా?
పరామర్శించుకొనేదెలా?
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
05.03.2020
( కాన్సర్ తో ఈరోజు చనిపోయిన ఒక ప్రముఖ వ్యక్తిని చూసి వస్తూ...)




కామెంట్‌లు లేవు: