"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

26 ఫిబ్రవరి, 2020

ఓ పరిశోధకుని ఉత్తరం!

నమస్కారం సార్..! మీరు రాసిన "బహుజన సాహిత్య దృక్పథం"లో 'ప్రపంచ సాహిత్య భావన' అనే వ్యాసంలో కొలకలూరి ఇనాక్ గారి వాక్యాలను రెండు కోట్ చేశారు.
 అయితే మీరు ఇచ్చిన రిఫరెన్స్ నాకు అర్థం కాలేదు. దయచేసి వివరించగలరు🙏. పుస్తకాలు చదవటానికి కూడా ఒక వయసు ఉంటుందనిపిస్తుంది సార్.! మీరు ఈ పుస్తకం ఇచ్చినప్పుడు చదివాను. అప్పుడు ఏమి అర్థమైందో నాకు అర్థం తెలియదు. గానీ ఇప్పుడు మళ్ళీ చదువుతుంటే మాత్రం బాగా అర్థమవుతుంది. చాలా బాగా రాశారు సార్. నేను ఈ మధ్య నేషనల్ సెమినార్స్ కోసం పరిశోధన పత్రాలు రాస్తున్న సమయంలో మీరు ఏ మెథడాలజీని ఫాలో అయ్యారో గమనించి నేను అదే ఫాలో అవుతున్నాను. మీరు ఒకసారి అంబేద్కర్ ఆడిటోరియంలో రీసెర్చ్ మెథడాలజీ గురించి గంటన్నర ప్రసంగం ఇచ్చారు. ఆ రికార్డింగ్ మొన్నీ మధ్యన విన్నప్పుడు అప్పటికన్నా ఇప్పుడు చాలా బాగా అర్థమైంది. నేను మీకు దూరంగా ఉన్నా? మీ ఆలోచనలకు మాత్రం బాగా దగ్గరగా ఉంటున్నాను. నిజం చెప్పాలంటే సినిమారంగంలోకి వెళ్లాలనుకుంటే రామ్ గోపాల్ వర్మను ఫాలో అవ్వాలి. సాహిత్య రంగంలో ఎదగాలంటే ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని ఫాలో అవ్వాలి. ఇది మీరు నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను. అందుకే బాగా ఫాలో అవుతున్నాను మిమ్మల్ని, మీ వ్యాసాలను🙏🙏
- ప్రవీణ్ యజ్జల, వాట్సాప్, 22.02.2020


కామెంట్‌లు లేవు: