కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2019) పొందిన డాక్టర్ గడ్డం మోహన్ రావుని దళిత స్టూడెంట్స్ యూనియన్ (28 జనవరి 2020 వ తేదీన) ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధ్యాపకులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య వి.కృష్ణ, ఆచార్య ఎండ్లూరి సుధాకర్, ఆచార్య రామ్మోహన రావు, డాక్టర్ రాణీ రత్నప్రభ ,
డాక్టర్ గోగు శ్యామల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దళిత స్టూడెంట్ యూనియన్ సభ్యులు చరణ్, వంశీ, సుమన్ తదితరులు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గడ్డం మోహన్ రావుకి పురస్కారం వచ్చిన కొంగవాలు కత్తి నవలను ఆవిష్కరించి పరిచయం చేశారు. తనకు చేసిన సత్కారానికి గడ్డం మోహనరావు సంతోషాన్ని వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలియజేశాడు. తాను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నానని, ఆ సమయంలో ఏం.ఏ., తెలుగులో దళిత సాహిత్యం ఒక పాఠ్యాంశంగా చదవడం వల్ల ఆ పాఠ్యాంశాల్లో చిలుకూరి దేవపుత్ర గారి పంచమం నవల ఉండేదని ఆ నవల ఈ కొంగవాలు కత్తి నవల రాయడానికి ప్రేరణ ఇచ్చింది అని తెలియజేశాడు. దళిత సాహిత్యం ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు గారి బోధన తనకు ఎంతగానో స్ఫూర్తి దాయకమైం దని పేర్కొన్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి