!
నాకింటికి రాగానే
ద్వారబంధానికతికించుకొని నిరీక్షించే
ఆ కళ్ళల్లో ఎన్ని మెరుపులో!
నా మెడను చుట్టేసే
జన్మజన్మల యెడబాటుని పోగొట్టే
ఆ రాగబంధాల పరిమళమెక్కడిదో!
నా అలసటపై కురిసే
బుంగ పలుకుల తేనె జల్లుల్తో
ఆ కాఠిన్యమెలా వెన్నముద్దైపోయిందో!
నాన్నా... నా చిట్టి తండ్రీ!
నువ్వొక్క స్ఫర్శనిస్తే స్వర్గమే ముందునిలిచే
ఆ మంత్రమేదో నాకూ నేర్పవూ!!
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 20.11.2019
ద్వారబంధానికతికించుకొని నిరీక్షించే
ఆ కళ్ళల్లో ఎన్ని మెరుపులో!
నా మెడను చుట్టేసే
జన్మజన్మల యెడబాటుని పోగొట్టే
ఆ రాగబంధాల పరిమళమెక్కడిదో!
నా అలసటపై కురిసే
బుంగ పలుకుల తేనె జల్లుల్తో
ఆ కాఠిన్యమెలా వెన్నముద్దైపోయిందో!
నాన్నా... నా చిట్టి తండ్రీ!
నువ్వొక్క స్ఫర్శనిస్తే స్వర్గమే ముందునిలిచే
ఆ మంత్రమేదో నాకూ నేర్పవూ!!
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 20.11.2019
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి