"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

27 ఫిబ్రవరి, 2019

డా.ద్వా.నా.శాస్త్రికి తెలుగు శాఖ ఘననివాళి

భూమి పుత్ర దినపత్రిక, 27 ఫిబ్రవరి 2019 


నమస్తే న్యూస్ దినపత్రిక, 27 -2-2019 


తెలుగు సాహిత్యాన్ని సామాన్య ప్రజలకు దగ్గరకు తీసుకు వెళ్లిన  ప్రముఖ సాహితీవేత్తల్లో డాక్టర్ ద్వా.నా. శాస్త్రి ఒకరిని, ఆయన రాసిన తెలుగు సాహిత్యం చరిత్ర పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందని సెంట్రల్ యూనివర్సిటీ మానవీయ శాస్త్రాల విభాగం డీన్ ఆచార్య ఎస్. శరత్ జ్యోత్న్నారాణి అన్నారు మంగళవారం ఉదయం ఆకస్మికంగా మరణించిన ప్రముఖ సాహితీవేత్త డా.ద్వా.నా.శాస్త్రి సంతాపసభ మంగళవారం మధ్యాహ్నం  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖలో నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన ఆచార్య పిల్లలమర్రి రాములు మాట్లాడుతూ డా.ద్వాదశి నాగేశ్వరర శాస్త్రి ' ద్వానాశాస్త్రి' గా ప్రసిద్ధులయ్యారని, నిత్య విద్యార్థిగా తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసేవారిని అన్నారు. బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ అభ్యదయభావాలుగల ఉన్నత వ్యక్తిత్వం గల సహృదయసాహితీవేత్త అని సంతాప సభను ఏర్పాటు చేసిన స్టూడెంట్ వెల్ఫేర్ డిప్యూటీ డీన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఈమధ్యే మరణించిన ప్రముఖ సాహితీవేత్త డా.పుట్ల హేమలత గార్కి కూడా  అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు ఘనంగా నివాళులర్పించారు. సభకు ముందు ఇరువురి సాహితీవేత్తలకు రెండు నిమిషాలు మౌనం పాటించారు.






సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ రచయిత, సాహితీవేత్త ద్వా.నా. శాస్త్రి (72) కన్నుమూశారు. గత అర్థరాత్రి ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ద్వానా శాస్త్రి గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. కాగా ద్వా.నా.శాస్త్రి అని పిలవబడే ద్వాదశి నాగేశ్వర శాస్త్రి కృష్ణాజిల్లా లింగాలలో 1948 జూన్ 15 వ తేదీన జన్మించారు. సాహితీ సవ్యసాచిగా పేరుగాంచిన ద్వానా శాస్త్రి విభిన్న పత్రికల్లో వేలాది పుస్తక సమీక్షలు చేసిన ఏకైక వ్యక్తి. వందేళ్లనాటి ఛాయా చిత్రాలు, అరుదైన పుస్తకాలు, అలనాటి విశేష కవితలు, వెలుగులోకి తెచ్చారు. అంతేకాకుండా సాహిత్యంలో పలు ప్రయోగాలు చేసి అంతర్జాతీయ రికార్డులు సొంతం చేసుకున్నారు. ఏకధాటిగా 12 గంటల పాటు తెలుగు భాషా సాహిత్యాలపై ప్రసంగించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.
(సాక్షి సౌజన్యంతో...)

సాక్షి దినపత్రిక, 27 ఫిబ్రవరి 2019 లో ఈ వార్త ప్రచురించారు. 


డా.ద్వానాశాస్త్రి గారితో నా అనుభవాల్లో కొన్నింటిని గతంలో స్మరించుకున్నాను. ఆ లింక్ ఇక్కడ ఇస్తున్నాను.