సుమారు 4000 పదాలతో కూడిన ఆంగ్ల, హిందీ, తెలుగు భాషల్లో రాజనీతి శాస్త్ర ప్రాథమిక పారిభాషిక పదకోశాన్ని కమీషన్ ఫర్ సైంటిఫిక్ & టెక్నికల్ టెర్మినాలజీ, , మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (ఉన్నత విద్యాశాఖ), గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఆచార్య అవినాష్ కుమార్ ప్రధాన సంపాదకుడుగాను, డా. షెహ్ జాద్ అహ్మద్ అన్సారి సంపాదకుడుగాను వ్యవహరించారు.
ఈ పదకోశనిర్మాణంలో హైదరాబాదు విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు ప్రొఫెసర్స్ భాగస్వాములుగా ఉన్నారు. ఈ పదకోశనిర్మాణానికి సంబంధించిన కార్యశాలలు హైదరాబాదులోని మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఉస్మానియా విశ్వవిద్యాలయం లలో జరిగాయి. ఈ కార్యశాలల్లో హైదరాబాదు విశ్వవిద్యాలయానికి చెందిన రాజనీతిశాస్త్ర పూర్వ అధ్యక్షుడు ఆచార్య పి.ఈశ్వరయ్య, తెలుగు శాఖలో అధ్యాపకుడుగా ఉన్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
రాజనీతిశాస్త్రశాఖలో అధ్యాపకుడుగా ఉన్న డా.ఇ.వెంకటేశుపాలుపంచుకున్నారు. ప్రస్తుతం ఈ పుస్తకాన్ని కమీషన్ ఫర్ సైంటిఫిక్ & టెక్నికల్ టెర్మినాలజీ, డిపార్ట్ మెంట్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ వారు నిర్వహించే వివిధ సెమినార్స్, వర్క్ షాఫుల్లో పాల్గొనే పరిశోధకులకు ఉచితంగా అందిస్తారు.అయితే, ఈ పుస్తకాన్ని మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ వెబ్ సైటు http://csttpublication.mhrd.gov.in లో ఉచితంగా అందుబాటులో ఉంచారు.
ఈ పదకోశం పరిశోధకులకు, వివిధ అనువాదకులకు, ఎం.ఏ., డి.గ్రీ, ఇంటర్మీడియట్ స్థాయిల్లో రాజనీతిశాస్త్రాన్ని తెలుగు, హిందీ మాధ్యమాల్లో చదివే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆ గ్రంథంలో పేర్కొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి