"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

18 February, 2019

నేనొక వేళ యుద్ధంలో మరణిస్తే...?

నేనొక వేళ యుద్ధంలో మరణిస్తే...?

నా పార్థివ దేహాన్నిశవపేటికలో పెట్టి
ఇంటికి చేర్చండి!
సాధించిన శౌర్యపతకాల్ని
నాచాతిపై మెరిపించండి!
నాశక్తివంచనలేకుండా
తన వాగ్దానాన్ని నెరవేర్చిన ధైర్యశాలితడని
నా కన్నతల్లికి చెప్పండి
నన్ను చూసి క్రుంగి పోవద్దని
నా కన్నతండ్రికి చెప్పి,
ఇకపై ప్రతిక్షణం నాకోసం 
ఏ  ఆందోళనా అవసరంలేదనీ చెప్పండి!
బాగా చదువుకోమని, ఇకపై నా బైకు తాళాలు
 
వాడినే శాశ్వతంగా దాచుకోమని
నా ప్రియమైన తమ్ముడికి చెప్పండి!
ఇంకా నేను రాలేదని నిరీక్షించే
నా ముద్దుల చెల్లెల్ని నిరాశ పడొద్దనీ, 
సూర్యాస్తమయం తర్వాతనే
నేను శాశ్వతంగా విశ్రాంతి తీసుకున్నానని చెప్పండి!
నా కోసం కన్నీళ్ళు కార్చొద్దని
నా ప్రియమైన దేశానికి మరీమరీ చెప్పండి
నేను మీకోసం మరణించడానికే
వీర సైనికుణ్ణైయ్యానని చెప్పండి!    -ఒక భారత సైనికుడు.
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

(మన భారత వీరసైనికుడు తమ తల్లిదండ్రులకు రాసిన చివరి కవితాత్మక లేఖగా వైరల్ అవుతున్న పోస్టుకి అళ్రునయనాలతో నా స్వేచ్ఛానువాదం.. ..ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 16 ఫిబ్రవరి 2019)


సూర్య సాహిత్యం పేజి, 18 ఫిబ్రవరి 2019










1 comment:

బుచికి said...

We have lost so many precious lives of soldiers. Now the priority should be to kill the enemy. Now on it should be a victorious roar. No more mourning.