"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

16 డిసెంబర్, 2018

తెల్ల కాగితం ( కవిత) సాహిత్య ప్రస్థానం సౌజన్యంతో...


సాహిత్య ప్రస్థానం, నవంబరు 2018, పుట: 23


తెల్ల కాగితం

ఎన్నాళ్ళిలా
రాతలున్నాఅక్షరాల్లేనట్లుండే కాగితమలా
నరాల్లో నేరాల్ని దాచుకుని
శ్వేతపత్రంలా మెరుస్తుంది?

ఎన్నాళ్ళిలామొలిచినకొమ్ములకు 
దేవతా వస్త్రాల్ని కప్పుకొని 
ఆ అడవిదున్నలా చేనంతా ధ్వంసంచేస్తుంది?
నాకిప్పుడు తెల్లకాగితాన్ని చూసినా
నల్లక్షరాల్ని చెరిపినగుర్తులో...
ఎవరన్నా మిస్టర్ క్లీన్ నంటుంటే
క్లీన్ కాలేని మరకలో...
ఎవర్నన్నా కరడుగట్టిన నేరస్తుడంటున్నా
కళ్ళల్లోదీనత్వమో ...
వంతెనల్ని దాటికెళ్ళేముందు 
గొంతులో గింగర్లు కొడుతున్న శబ్దాలు!
పోలీస్ స్టేషన్ ముందు ఎముకను నాక్కుంటూ
సొల్లు కారుస్తున్న కుక్కల అరుపులేంటిలా
పొద్దున్నే వాకిటిల్లోకి యెగిరొచ్చి 
ఇళ్ళంతా ఖరాబుచేస్తున్నాయి?
ఆ అరుపుల్ని అర్ధం చేసుకోవాలంటే 
యే ఇన్వెస్టిగేషన్ కంపెనీలో 
కొనాలో నిఘంటువుల్ని!
ఏకాంతపు ఒంటరితనమైనా
ఒంటరితనపుసమూహమైనా
భరించడమంతసులభం కాదేమో!
'ఆపండ్రా బాబూ' 
పొద్దున్నే ఆ ఇడియట్ బాక్స్

 ఏమిట్రా  జుర్రుజుర్రున పీల్చే ఎముకలరుచుల్ని  

వినలేకపోతున్నాను!
అవతలకిసిరేయండ్రా 
సంతోషాన్నో, దుఃఖాన్నో పలకని
తెల్లకాగితాల్ని చూడలేకపోతున్నాను!
-దార్ల వెంకటేశ్వరరావు, 9182685231
6 ఆగస్టు 2018


( సాహిత్య ప్రస్థానం మాసపత్రిక, నవంబరు 2018, పుట: 23 లో ప్రచురితం)



కామెంట్‌లు లేవు: