న్యూస్ పేజ్ దినపత్రిక
ఈనాడు, 6 అక్టోబర్ 2018
విద్యార్థులతో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
సమావేశంలో మాట్లాడుతున్న రామస్వామి యాదవ్
సామాజిక అభివృద్ధి లో ఉపాధ్యాయుల పాత్ర క్రియాశీలకమైనదని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం సాయంత్రం గౌలిదొడ్డిలో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల ( బాలుర) లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ గారి ఆధ్వర్యంలో 'ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవా'న్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగుశాఖలో ఆచార్యులు, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవా'న్ని జరుపుకోవడం ద్వారా ఉపాధ్యాయుల్లో నైపుణ్యాభివృద్ధికి గొప్ప ప్రేరణగా నిలుస్తుందని యునెస్కో సూచించిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను సత్కరించడం సముచితంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పదిమంది ఉపాధ్యాయులను సత్కరించారు. సభలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి కె.రజిత మాట్లాడుతూ విద్యార్థులను చదివించడం కోసం తమ పిల్లల్ని కూడా వదిలేసి ఉంటారని, అయినా విద్యార్థులు సాధించిన విజయాలు చూసి అన్ని కష్టాలను మరిచిపోయి సంతోషిస్తారని అన్నారు. సభలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ కార్యదర్శి వి.ఫణికుమార్, సభ్యులు శ్రీ చందన, విష్ణు ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి