నీ కౌగిలి తన్మయత్వం!
అప్పుడప్పుడూ నువ్వు
కనిపించీ కనిపించని దారిలో నడుస్తున్నట్టు
నువ్వు అర్ధమైయ్యీ
అర్ధం కానట్లనిపిస్తావు
ప్రేయసీ ప్రియుల్లా
కర్త,కర్మ క్రియల్లేని మాటల్నేవో
గుసగుసలాడుతున్నట్లుంటావు
ఎగిరేపిట్టల వెంటపరుగెడతాను
కదిలే నదుల్లో దూకుతాను
అంతా అలిసిపోయాననుకుంటారు
ఆనందంలో తడిసిపోయాను
మెరుస్తున్న కళ్ళల్లో తెలిసిపోకుండా
ఆ పిట్టలు చూపిన చోటుల్ని
నేను మాత్రమే చూసుకుంటూ
నదులు తీర్చిన దాహాన్ని
నేను మాత్రమే రుచినాస్వాదిస్తూ
రెప్పలవాకిళ్ళు మూసుకుంటాను
నువ్వు అర్ధమైయ్యీ
అర్ధం కానట్లనిపిస్తావు
ప్రేయసీ ప్రియుల్లా
కర్త,కర్మ క్రియల్లేని మాటల్నేవో
గుసగుసలాడుతున్నట్లుంటావు
ఎగిరేపిట్టల వెంటపరుగెడతాను
కదిలే నదుల్లో దూకుతాను
అంతా అలిసిపోయాననుకుంటారు
ఆనందంలో తడిసిపోయాను
మెరుస్తున్న కళ్ళల్లో తెలిసిపోకుండా
ఆ పిట్టలు చూపిన చోటుల్ని
నేను మాత్రమే చూసుకుంటూ
నదులు తీర్చిన దాహాన్ని
నేను మాత్రమే రుచినాస్వాదిస్తూ
రెప్పలవాకిళ్ళు మూసుకుంటాను
నన్ను పిచ్చోడనో
నన్ను ఋషిననో
ఎవ్వరేమంటే నాకేమి
నిన్నందుకున్నాను
నన్ను ఋషిననో
ఎవ్వరేమంటే నాకేమి
నిన్నందుకున్నాను
ఇన్నాళ్ళూ నిన్ను
నిఘంటువుల్లో వెతికాను
మనసులోతుల్లో తేలుతున్న
మనిషి లోతుల్లో దాగున్న నిన్నందుకున్నాను
ఎవ్వరేమంటే నాకేమి
నిన్ను చేరుకునప్పుడల్లా
నిలువెత్తు ఆనందంతో అభిషేకిషిస్తున్నావు!
-దార్ల వెంకటేశ్వరరావు
నిఘంటువుల్లో వెతికాను
మనసులోతుల్లో తేలుతున్న
మనిషి లోతుల్లో దాగున్న నిన్నందుకున్నాను
ఎవ్వరేమంటే నాకేమి
నిన్ను చేరుకునప్పుడల్లా
నిలువెత్తు ఆనందంతో అభిషేకిషిస్తున్నావు!
-దార్ల వెంకటేశ్వరరావు
09182685231
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి