"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

05 అక్టోబర్, 2018

ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం,5 అక్టోబరు 2018


ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం,5 అక్టోబరు 2018
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్
ఫోను: 9182685231
ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ప్రతి యేడాదీ  అక్టోబరు, 5వ తేదీన  జరుపుకోవాలని, 1994 నుండి నిర్ణయించారు. 1966 లో UNESCO / ILO ఒక కమిటీ ఏర్పడి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల పనితీరునీ, వారి సాధకబాధకాలను చర్చిస్తూ కొన్ని  సిఫార్సులు చేసింది. వాటిని అనుసరించి ఉపాధ్యాయుల హోదాకు సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను  రూపొందించి, ఉపాధ్యాయులు చేసేది ఒక వృత్తిగా గుర్తిస్తూ ఉపాధ్యాయ హోదాపై సంతకం చేసింది. ఈ సిఫార్సులు ప్రధానంగా విద్యాసంస్థల సిబ్బంది వ్యవహరించవలసిన విధానం, వారి నియామకం, వారికి ఉండాల్సిన ప్రారంభ శిక్షణ అలాగే ఉపాధ్యాయులు నిరంతరం కొనసాగించాల్సిన కృషీ, వారి ఉపాధి అవకాశాలు, వారి పని పరిస్థితులు సంబంధించిన అనేక  ప్రమాణాలు రూపొందించింది.  వీటిని 1998లో పుస్తకరూపంలో ప్రచురించింది.[1]
ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యం ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలను ప్రశంసించడం, వారి నైపుణ్యాలను అంచనా వేయడం మరియు వాటిని మెరుగుపరచడం’’. దీనితో పాటు ఉపాధ్యాయులకు మరియు బోధనలకు సంబంధించిన సమస్యలను చర్చించుకోవడానికి ఒక అవకాశంగా పరిగణించడం కూడా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ లక్ష్యమే. [2]
సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల క్రియాశీలక పాత్రను తెలియజేయడం, వారి ప్రాధాన్యతను సమాజం గుర్తించడానికీ ప్రతిసంవత్సరం అంతర్జాతీయంగా ఉన్న విద్యాసంస్థలలోనూ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాలను జరుపుకోవాలని యునెస్కో, సూచించింది[3].  దీన్ని నిర్విఘ్నంగా నిర్వహించుకోవడానికి కొన్ని ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాన్ని కూడా స్వీకరించవచ్చు. ప్రతి యేడాదీ ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని నిత్య నూతనంగా జరుపుకోవడానికి వీలుగా ప్రతి సంవత్సరాన్నీ ఒక ప్రధానమైన అంశాన్ని కేంద్రీకరించి జరుపుకోవడం వల్ల ఉత్సాహాన్ని పొందడంతో పాటు, ఉపాధ్యాయుల లక్ష్యాలను ఒక్కొక్కదాన్నీ శాస్త్రీయంగా గుర్తించే వీలుకలుగుతుంది. ఉదాహరణకు 1997 సంవత్సరాన్ని ఉపాధ్యాయ సాధికారికతను ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకుని, 1966లో ఉపాధ్యాయుల గురించి యునెస్కో చేసిన సిఫారసుల ముసాయిదాను 1998లో ప్రచురించింది.  దీని వల్ల విద్యారంగంలో నిర్లక్ష్యానికి గురౌతున్న అంశాల్ని గుర్తించి, వాటిని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ అంశాలు ఉపాధ్యాయులకూ, విద్యాసంస్థలకూ ఎంతో మేలు చేస్తాయి.
2018 వ సంవత్సరానికి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా యునెస్కో నిర్దేశించిన లక్ష్యం                                 ‘‘ విద్యాహక్కు అంటే అర్హుడైన ఉపాధ్యాయుణ్ణి పొందడం’’ ("The right to education means the right to a qualified teacher.’’ ) [4] మానవహక్కుల ప్రకటన జరిగి (1948) ఈ యేడాదికి 70 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాలని సూచించింది. మానవ హక్కుల ప్రకారం ప్రతి విద్యార్థికీ ఉచితంగా చదువుకునే అవకాశాన్ని ఒక ప్రాధమిక హక్కుగా సాధించగలుగే అవకాశాలున్నాయని భావించింది. ఆ హక్కు కూడా శిక్షణ పొందిన అర్హులైన ఉపాధ్యాయుల ద్వారా నెరవేరాలని సూచించింది.
ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాల్ని ప్రతి ఒక్క విద్యాసంస్థా జరుపుకోవడం ద్వారా ఉపాధ్యాయుల్లో నైపుణ్యాన్ని పెంచుకోవడం, తమ బాధ్యతలను విస్మరించపోవడం, సమాజంలో తమ బాధ్యతలను గుర్తెరిగి సమాజాభివృద్ధికి తోడ్పడ్డానికి ఇది ఎంతగానో ప్రేరణగా నిలుస్తుందని వ్యాఖ్యానించింది. సుమారు 100 దేశాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి యేడాదీ అక్టోబరు 5 వతేదీన ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. దీనితో పాటు ప్రతి దేశం, రాష్ట్రం వారు తాము ప్రకటించుకున్న ఒక ప్రత్యేక సందర్భంలో కూడా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుంది. భారతదేశంలో సెప్టెంబరు 5 వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. దీనితో పాటు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యావకాశాల్ని, అన్ని దేశాలతో అనుబంధాన్ని ఏర్పరుచుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా ఈ దినోత్సవం ప్రేరణనిస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఆ యా దేశాల వారు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకునే కొన్ని దేశాల వివరాలను కింద తెలియజేస్తున్నాను.
దేశము
పేరు
తేదీ
నోట్
ఫెస్టా అ ఎ మీసుయెసిట్
మార్చి 7
1867 లో మొదటి పాఠశాల స్థాపించి మొదటిసారిగా పాఠాలు బోధించిన సందర్భంగా.
డయా డెల్ మాస్ట్రో
సెప్టెంబర్ 11
డొమింగో ఫాస్టినో సర్మియెంటో గౌరవార్థం
ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం
అక్టోబరు ఆఖరు శుక్రవారం
Beynəlxalq Müəllimlər Günü
అక్టోబరు 5
ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం నాడే జరుపుకుంటారు.
డయా డో ప్రొఫెసర్
అక్టోబరు 15
A decree regulating the elementary schools in Brazil. The celebration gained popularity throughout the country, and October 15 was officially designated Teachers' Day in 1963.
డయా డెల్ ప్రొఫెసర్
అక్టోబరు 16
foundation of the Colegio de Profesores de Chile (Teachers' College of Chile).
చైనా (PRC)
师节
సెప్టెంబర్ 10
Usually there are some activities for the students to show their appreciation to the teachers, such as presenting gifts including cards and flowers.
డయా డెల్ ప్రొఫెసర్
మే 15
[bharath
rakshith
అక్టోబరు 4
ఈ రోజున holyday తరగతులు జరుగవు.
డెన్ ఉసీటెలు
మార్చి 28
ఏప్రిల్ 13
జూన్ 22
జాతీయ సెలవుగా పరిగణిస్తారు.[6][7]
సెప్టెంబర్ 10
Pedagógus nap
జూన్ యొక్క మొదటి శనివారం

Shikshak Divas
సెప్టెంబర్ 5
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవం.
హరి గురు
నవంబరు 25
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం
మే 2 (ఇరానియన్ కేలండరు ప్రకారం ఓర్దె బెహిష్త్ 12 వ తేదీ)
మొర్తజా మతహరి సంస్మణార్థం 1979 మే 2.
ఉపాధ్యాయ దినోత్సవం
మే 6
మే 6 లేదా మే నెల మొదటి బుధవారం.[8]
mokytojo diena
అక్టోబరు 5
Between 1965 and 1994, the first Sunday of October. Since 1994, on October 5, to coincide with the World Teachers' Day (est. 1994 by UNESCO).
ఈద్ అల్ ముఅలిమ్
మార్చి 3
Between March 3 and March 9 all the celibrations happen . Lebanese people are known for their love and respect to teachers .
హరి గురు
మే 16
Although it is not an official school holiday, celebrations are usually held on May 16, or earlier, if it falls on a Saturday or Sunday.
డయా డెల్ మాస్ట్రో
మే 15
Багш нарийн баярын өдөр (ఉపాధ్యాయ దినోత్సవం)
ఫిబ్రవరి మొదటి వారాంతము
ఉపాధ్యాయ దినోత్సవం
అక్టోబరు 5
It recognizes the importance of teachers and attributes progress to the quality of teachers in Pakistan's Educational System.
Día del Maestro
డిసెంబరు 1
మాన్యుయెల్ జోసే హుర్తాదో సంస్మణార్థం
డయా డెల్ మాస్ట్రో
ఏప్రిల్ 30
డయా డెల్ మాస్ట్రో
జూలై 6
అరాంగ్ మగా గురో (ఉపాధ్యాయ దినోత్సవం)
అక్టోబరు 5
రాష్ట్రపతి అధికరణ ప్రకారం దేశవ్యాప్తంగా 5 లక్షల మంది ఉపాధ్యాయులను సత్కరిస్తారు.
Dzień Nauczyciela
అక్టోబరు 14
On this day is the anniversary of creation the Commission of National Education, created in 1773 from the initiative of King Stanisław August Poniatowski
День учителя
అక్టోబరు 5
Between 1965 and 1994, the first Sunday of October. Since 1994, on October 5, to coincide with the World Teachers' Day (est. 1994 by UNESCO).
సెప్టెంబర్ 1
An official school holiday. Celebrations are normally conducted the day before, when students get half a day off.
Deň učiteľv
మార్చి 28
జాన్ అమోస్ కొమెనియస్ జన్మదినోత్సవ గౌరవార్థం.
మే 15
教師
సెప్టెంబర్ 28
The day honors teachers' virtues, pains, and also their contribution not only to their own
วันครู
జనవరి 16
Adopted as Teachers' Day in the Thailand by a resolution of the government on November 21, 1956. The first Teachers' Day was held in 1957.
Öğretmenler Günü
నవంబరు 24
ముస్తఫా కమాల్ అతాతుర్క్ను టర్కీవాసులు ప్రధాన ఉపాధ్యాయునిగా భావిస్తారు.
మే మొదటి వారం
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం
Ngày nhà giáVit Nam
నవంబరు 20
వియత్నామీ ఉపాధ్యాయ దినోత్సవం.




[1] http://unesdoc.unesco.org/images/0016/001604/160495e.pdf
[3] Power, Colin (2014). The Power of Education: Education for All, Development, Globalisation and UNESCO. New York: Springer. p. 191. ISBN 9789812872210.
[4] https://en.unesco.org/events/world-teachers-day-2018-right-education-means-right-qualified-teacher

కామెంట్‌లు లేవు: