ప్రముఖ పద్యకవి డాక్టర్ మల్లవరపు రాజేశ్వరరావు
24 అక్టోబరు 2018వ తేదీన హఠాన్మరణం చెందారు. మధురకవి బిరుదాం కితుడు, పద్యకవుల్లో పేరెన్నిక గన్న మల్లవరపు జాన్ కవి కుమా రుడు మల్లవరపు రాజేశ్వరరావు. తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ తెలుగుపండితుడిగా పనిచేస్తూనే అనేక రచనలు చేశారు. 1949 ప్రకాశం డిసెంబరు 17 వతేదీన జిల్లాలో జన్మించిన రాజేశ్వరరావుకి 'జీవనది' పద్యకావ్య సంపుటి ఎంతో పేరు తెచ్చింది. భక్తయోబు, అనాథ గంగ, ఎయిడ్స్ మహమ్మారి, బాలగేయాలు, హన్నా, కాళింది, రజయ ప్రణయం, ఎస్తేరు రాణి మొదలైన రచనలు చేశారు. వీటితో పాటు ఈయన రాసిన కావ్యాలు, నాటకాలు ముద్రణలో ఉన్నాయి.
ఈయన రాసిన 'ముంతాజ్ మహల్' పద్యకావ్యం అనేకమంది సాహితీవేత్తల ప్రశంసలు అందుకుంది. పద్యంలోరాసినప్పటికీ వీరి భాష ఎంతో సరళంగా ఉంటుంది. మల్లవరపు జాన్ కవి వారస త్వాన్ని పుణికి పుచ్చుకొని పోతనలోని మాధుర్యాన్ని, కరుణశ్రీలోని మృదుత్వాన్ని, వేమనలోని వస్త్వలంకారాలతో సత్యాన్ని సామాన్యు లకు అందించగల నేర్పునీ, జాషువాలోని సామాజిక స్పందన్నీ ఏకోన్ముఖంగా మనకి అందించగల కళానైపుణ్యం ఈయన కవిత్వం లో కనిపిస్తుంది. ఈయన రాసిన 'మల్లవరపు శతకం'లో సామాజిక సమస్యల్ని వర్ణించారు. 'మతములన్నియు జనుల హితమునే కూ ర్చును/ సత్యము వాని నమ్మి సాగువారి/బ్రతుకులందు శాంతి భావాలు వెలుగొందు/ మల్లవరపు మాట మల్లెమూట' అని మతం ప్రజలకు హితాన్ని కలిగించి ముందుకు తీసుకుపోవడానికి ఒక మార్గంగా ఉండాలని ధ్యన్యాత్మకంగా ప్రబోధించారు.సమాజంలో జీవిస్తున్న బాధ్యతాయుత మైన కవిగానీ, కళాకారుడు గానీ తన చుట్టూ జరుగుతున్న వాటికి స్పందించడంలో 'కళాత్మకత' ఉంటుం ది. అది బయటకొచ్చే వరకు 'పురిటి నొప్పులు' భరించాల్సిందే నన్నట్లుంటుంది. కొన్నిసార్లు 'గుం డెగొంతులో కొట్లాడుతూనే ఉం టుంది. నిలబడనీయదు. అందరి లో ఉన్నా ఒంటిరిని చేస్తుంది. ఒంటరిగా ఉన్న సమూహాన్నీ చేస్తుంది. అది బయటకొచ్చిన తర్వాత కవి గొప్ప రిలీఫ్ పొందుతాడు. కవి మల్లవరపు రాజేశ్వరరావు అటువంటి 'తల్లి'గురించెలా వర్ణించారో చూడండి. 'కనెడి వేళ తల్లి కష్టంబు పడునెంతొ/ కాన్పులైన పిదప కలత మరచు/ హత్తుకొనును బిడ్డ పొత్తిళ్ళలో నుంచి/మల్లవరపు మాట మల్లె మూట'. గుర్రం జాషువా స్మారక కళాపరిషత్, ప్రకాశం జిల్లా ముస్లిం రచయితల సంఘం, శ్రీకష్ణదేవరాయ సాంస్కృతిక సేవా సమితి మొదలైన సంస్థలు పురస్కారాలతో పాటు, ఆచార్య నాగారు ్జన విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారంతో సత్కరించింది. 2007 లో ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందు కున్నారు. ఈయన రాసిన జీవనది కావ్యంపై తెలుగుశాఖ, హైదరా బాదు విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ పరిశోధన చేశారు.
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
తెలుగుశాఖ, సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాద్
9182685231
(నవంబరు 3, 4 తేదీల్లో ఒంగోలులో బహుజన రచయితల సంఘం- ప్రకాశం జిల్లా యూనిట్, వివిధ ప్రజాసంఘాలు మల్లవరపు రాజేశ్వరరావు సంస్మరణ సభ నిర్వహిస్తున్నాయి.)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి