"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

12 August, 2018

అగ్నిపునీతకు అశ్రుతర్పణం! ( ‘మనం’ దినపత్రిక సౌజన్యంతో)






ఆ క్షణంలోనూ పన్నీటి జల్లుల్నే కురిపించావు
ఆక్షణంలోనూ సిరిమల్లెల్నే పరిమళించావు
ఆక్షణంలోనూ పసిపాపలా
మా మనసుల్ని ఉయ్యాల్ని చేసుకున్నావు
మాలో నువ్వలా కదులుతున్నసేపూ
నీఅడుగులకు వేలాడుతూ
మాకనురెప్పులచప్పుళ్ళు తడబాటు!
ఒకకంటిలో ఆనందం, మరో కంటిలో ఆందోళన
నువ్వూగుతున్న ఊయల్నొదల్లేకపోయిన
నీకేరింతల్లో కలిసిపోయిన మా గుండెల్లోని గుబులు
!
కన్నీళ్ళెలా గడ్డకడతాయే
 
నిప్పులమడుగపై కూలబడి కూడా చెదరనివ్వని
 
నీనీతిచూసి నైతికత నివ్వెరపోతూ పలికింది
వయసడ్డొచ్చిందిగానీ
నిన్నుమాహృదయాలకు హత్తుకోలేకపోయామనేబాధ
 
మమ్మల్నింకా నిలువెళ్ళా కాల్చేస్తుంది!
నువ్వు దహించుకుపోతున్నా
 
వ్యవస్థనగ్నిగుండంలో తోసెయ్యకుండా
నువ్వు విసిరిన ఆ చిరునవ్వుల హస్తాల్ని
అందుకోలేకపోయామని మమ్మల్ని నిలేస్తున్నాయి
ఒకపక్కచావు సంకనెక్కికూర్చున్నా
 
నువ్వేంటమ్మా...నిష్కపటమెరుగని కరుణామయిలా
దాన్నలా పసిపిల్నిని చేసి లాలించావు
?
నీది అమాయకత్వమనుకోవాలో
మాది అమాయకత్వమనుకోవాలో
 
అమాయకత్వాన్నే పునర్నర్వచించుకోవాలో
 
నువ్వు మాత్రం నిజంగా ఓ అగ్నిపునీతవే!
-దార్ల వెంకటేశ్వరరావు
9182685231
(ఇటీవల తనను తాను కాల్చకొని చనిపోయిన సెంట్రల్ యూనివర్సిటి రీసెర్చ్ స్కాలర్ ‘నీతూదాసు’తో మాట్లాడిన మాటల్ని, ఆ దృశ్యాన్ని మరిచిపోలేకపోలేక అశ్రునివాళినర్పిస్తూ...!)


No comments: