నిత్యశుభములగుచు నిలిచెవెలుగు
తలచుకున్నయగును తనకుకళ్యాణంబు
దారి పూల తోట దార్ల మాట!
అలలనూగెనాడు ఇలనువెలిసినేడు
కలియుగమున కనగ వెలిసెమనకు
మానవుండునటులెమసులుకొనుమనుచు!
దారి పూల తోట దార్ల మాట!
సాగరంబువోలెసాగెనీయేడాది
ఆడుకొనుచునేమిపాడుకొనుచు
ఇంతకన్నమాకుసంతసంబేదయా
దారి పూల తోట దార్ల మాట!
మాయ, వేంకటేశు మాయింటపండగై
వైష్ణవీయునృత్యమైయ్యెనయ్య
మురళిమోహనంబుమురిపించెనెంతనో
దార్లయిల్లె కళల ధరణియయ్యె
చంద్రమౌళిమానసంబంతచల్లన
మురళిమోహనుండుముచ్చటవగ
మెల్లనైనజల్లుఅల్లూరిమస్తాను
దార్లయిల్లుకళలధరణియయ్యె
పారవశ్యమయ్యె పసిపిల్లవోలెను
పుష్ప గుచ్చమౌను పుష్పిణమ్మ
కృష్ణవేణిరుచులమృష్టాన్నమొడ్డిం
దార్లయిల్లుకళలధరణియయ్యె
శ్రీధరుడుసునీలు చిరునవ్వులందించు
యెక్కుడైననేమి చక్కగొచ్చి
పాటలుండుమడుగుబడిగేఉమేశుడు
దార్లయిల్లుకళలధరణియయ్యె
చిలుకుకొనగవెన్న శ్రీపతి మారుతి
పెదవినుండుజోకుపెద్దమనిషి
రాజసంబునుండు రామప్రసాదుడై
దార్ల యిల్లు కళల ధరణి యయ్యె
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి