సీసము:
నేడేమనకలలు నెరవేరె నేడేమ
నమనసులుప్పొంగె నవ్యమగుచు
నేడేమనక్రొత్త నేస్తము బిడియము
పోగొట్టు భాషయేదోకనపడె
నేడేగతముజన్మ వేడుకలేవో మ
రలివచ్చి వెలుగుల రాజ్యమిచ్చె
నేడేగగనమందు దేవతలంతయు
హర్షమొందుచుపూలవర్షమయ్యె
తే.గీ:
పార్వతీపరమేశ్వర సర్వసృష్టి
కాదికార్యమైశోభిల్లుకార్యమనుచు
సర్వజనుల సంతసమందు కార్యమగుచు
మనకుపరిణయమీనాడెఘనముగయ్యె
సీసము:నేడేమనకలలు నెరవేరె నేడేమ
నమనసులుప్పొంగె నవ్యమగుచు
నేడేమనక్రొత్త నేస్తము బిడియము
పోగొట్టు భాషయేదోకనపడె
నేడేగతముజన్మ వేడుకలేవో మ
రలివచ్చి వెలుగుల రాజ్యమిచ్చె
నేడేగగనమందు దేవతలంతయు
హర్షమొందుచుపూలవర్షమయ్యె
తే.గీ:
పార్వతీపరమేశ్వర సర్వసృష్టి
కాదికార్యమైశోభిల్లుకార్యమనుచు
సర్వజనుల సంతసమందు కార్యమగుచు
మనకుపరిణయమీనాడెఘనముగయ్యె
కాసులెన్నియున్నను కాలగర్భమునందు
కరిగిపోవుచునుండు కలత మిగులు
అతిలోక సుందర మందచందములైన
వార్ధక్య మరుదెంచ వాసితగ్గు
ఉర్విపై నెందరో గర్వపోతులుకూడ
మట్టిలో కలిసిరి చిట్ట చివర
మకరందమును లేని మంకెన పువ్వులన్
కోరువారున్నరా కొందరైన
ఆ।।వె।।
సతియు పతుల మధ్య సంతోషమును పంచె
ప్రేమ బంధమేను పెన్నిదగును
కడను దాక మనిషి గౌరవంబుగనుండు
లేక యున్న యదియె లేవడగును
-గోవిందుని గోవర్ధన్
(ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు, డా।।మంజుశ్రీ దంపతుల వివాహవార్షికోత్సవ శుభాకాంక్షలతో...)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి