"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

01 జులై, 2018

మౌనఘనీ‘భవనం’ ( ఈవారం కవిత)



మౌనఘనీ'భవనం'!

ఏమిటిది?

పూలతోటలో శత్రుకీటకాల సామూహిక దాడి 

ఈ మొక్కల్నలా బుల్డోజర్లతో తొలిచేస్తున్నదెవరు?

జీవితాన్ని చిగురించుకొనే పిడికెడు నేలే కరువయ్యిందే!

గుండెనిలా మెత్తగా కోసేస్తున్నదెవరు?

నా నుండి నన్నే దూరంగా విసిరేస్తున్నదెవరు!!

దేన్నైనా కరిగించగలిగే సముద్రంలో

ఎందుకలా పర్వతాలు మొలుసుకొస్తున్నాయో!

ఆ పర్వతాలింగనాల్లో తడిసిన

ఎందుకలా రాగరంజిత ముద్రలు రోదిస్తున్నాయో!

నదీనదాల్లారా... 

మీ స్నేహామతాన్నలా మింగేస్తున్నదెవరు?

ఏమిటీ నిశ్శబ్దం? ఏ ఆకూ మెదలదేమి!

ఏమిటీ మౌన ఘనీ'భవనం'? ఏశబ్దమూ ధ్వనించదేమి!

ఆ సూర్య చంద్రులలా స్థంభించిపోయారేమి?

ఊపిరాడని ఆ ఏకాకితనమేమి?

ఏమిటీ అకస్మాత్తుపు నిద్ర?

ఎక్కడకీ అమాంతపు విస్మరణ యాత్ర?

ఏమిటీ విడువడని నిశాసర్పగాఢపరిష్వంగం?

                                                         - దార్లవెంకటేశ్వరరావు

                                                         9182685231


కామెంట్‌లు లేవు: