"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

18 జూన్, 2018

‘కాలా’ చలన చిత్రంపై పద్యాలు



13 జూన్ 2018, గణేష్ పత్రిక


కాల్పనికతనింపికళనేమరిచినట్టి
చలనచిత్రమగుచు చరితయనిన
కళకుజీవకళను 'కాల'కుదక్కురా!
దారి పూల తోట దార్ల మాట!

పారవశ్యమైతి 'పారంజితా'నీకు
నీదుసాహసంబు నీదురణము
తలుచుకొందురయ్య దళితులంతానిన్ను!
దారి పూల తోట దార్ల మాట!


సాహసమునచెప్పె సాధించుటయెటులో
రంగుకున్నశక్తిరంగరించి
నలుపుయెరుపుకలిసినడవమనియెనోయి!
దారి పూల తోట దార్ల మాట!

('
కాల' చలనచిత్రం క్లైమాక్స్ సమకాలీనంగా జరగాల్సిన రాజకీయ నిర్దేశం)

కామెంట్‌లు లేవు: