"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

16 ఏప్రిల్, 2018

సెంట్రల్ యూనివర్సిటీలో శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్ గోల్డ్ మెడల్

స్వర్గీయ శ్రీ దార్ల అబ్బాయి గారు

మా నాన్నగారు స్వర్గీయ శ్రీ దార్ల అబ్బాయి (లంకయ్య) గారి పేరు మీదుగా హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటి, తెలుగుశాఖలో ఎం.ఏ.లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థికి ప్రతి యేడాదీ ఒక గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రాన్ని ఇచ్చేలా విశ్వవిద్యాలయం 79 వఅకడమిక్ కౌన్సిల్ అంగీకరించింది. 2018-19 విద్యాసంవత్సరం నుండి ఈ గోల్డ్ మెడల్ బహూకరించడం ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి పత్రికలు  ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
University of Hyderabad, Academic Council Approval on 23 September 2018 page: 11

ఆంధ్రజ్యోతి, హైదరాబాదు, 14 ఏప్రిల్ 2018

నమస్తేతెలంగాణ, 14 ఏప్రిల్ 2018

సాక్షి, తెలంగాణ రాష్ట్రం మెయిన్ పత్రిక, 16 ఏప్రిల్ 2018



ఈ విద్యా సంవత్సరం నుండి ప్రతియేడాదీ హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటి వారు ప్రముఖ సంఘసేవకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు స్వర్గీయ శ్రీదార్ల అబ్బాయి (లంకయ్య) గారి పేరుతో ఒక బంగారు పతకాన్ని బహూకరిస్తారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సెంట్రల్ యూనివర్సిటిలో జరిగిన 79 వ అకడమిక్ కౌన్సిల్ లో ఆమోదించారు. ఈ విషయాన్ని 2018-19 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం విడుదల చేసిన ప్రకటన ( గోల్డ్ మెడల్స్ జాబితా, సీరియల్ నెంబరు: 46)లో కూడా అధికారికంగా ప్రకటించారు. సెంట్రల్ యూనివర్సిటిలో ఎం.ఏ., తెలుగు            ( భారతీయ కావ్యశాస్త్రం, సాహిత్య విమర్శ రంగాల)లో అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభావంతులకు శ్రీదార్ల అబ్బాయిగారి పేరుమీద ఒక బంగారు పతకాన్ని, ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. ఈ బంగారు పతకాన్ని సాధారణంగా ప్రతియేడాదీ జరిగే విశ్వవిద్యాలయం వారి స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథులుగా పాల్గొనే రాష్ట్రపతి/ఉపరాష్ట్రపతి/ రాష్ట్రగవర్నర్/ కేంద్ర మంత్రులు/ వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు బహూకరిస్తారు.
స్వర్గీయ శ్రీ దార్ల అబ్బాయి గారు తూర్పుగోదావరి జిల్లా, కాట్రేనికోన మండలం, చెయ్యేరు అగ్రహారంలో జన్మించారు. ఆ ప్రాంతంలో ఎంతోమందిని అక్షరాస్యులను చేయడానికి తనవంతు కృషిచేశారు. భారత స్వాతంత్ర్యోద్యమం కోసం జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంతో పాటు, మద్యపాననిషేదోధ్యమం, అక్షరాస్యతా చైతన్యం, కులనిర్మూలన మొదలైన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఈయనకు ఐదుగురు పిల్లలు. ఒకరు సెంట్రల్ యూనివర్సిటిలో ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు. ఒక కొడుకు తప్ప మిగతావాళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. వీరి కుటుంబంలో అత్యధికంగా బోధన రంగాన్నే ఎంచుకోవడం విశేషం. విద్య అజ్ఞానాన్ని పోగొడుతుందని తమ తండ్రి ఎప్పుడూ చెప్పేవారనీ, అందుకనే బాగా చదువుకొని ఆ రంగంలో స్థిరపడ్డామని కుటుంబసభ్యులు తెలిపారు. ఎంతో ప్రతిష్ఠాకరమైన సెంట్రల్ యూనివర్సిటిలో తమ తండ్రిగారిపేరుతో ఒక బంగారు పతకాన్ని ప్రకటించడం తమకెంతో సంతోషంగాను, గర్వంగాను ఉందన్నారు.   తమ తండ్రి గారి స్పూర్తితో వివిధ సేవాకార్యక్రమాలను తమ ట్రస్టు ద్వారా చేయాలని సంకల్పించినట్లు ప్రకటించారు.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
చైర్మన్,
డా దార్ల రవికుమార్
 ప్రధాన కార్యదర్శి
శ్రీ దార్ల అబ్బాయి  మరియు శ్రీమతి పెదనాగమ్మ మెమోరియల్ ట్రస్టు


1 కామెంట్‌:

Unknown చెప్పారు...

good morning
its a nice information blog
The one and the only news website portal INS Media.
please visit our website for more news updates..
https://www.ins.media/