18 ఏప్రిల్, 2018
తొలివలపు
మనసుమబ్బులో మెరుపులు మెరిసినట్లు
ముట్టుకొనగానుషాకునే కొట్టినట్లు
కళ్ళు మూసినా నీరూపు కనులనుండు
యేమి జేసితివేనువ్వు యెదను చేరి?
ఇంత మందియునున్ననూ నిన్నె తలుతు
నింత మందిపొగిడినను నీదె నిలుచు
నింత మందియెగబడిన నిన్నె పిలుతు
నింతగానెందుకిష్టమై నిలిచినావు?
ఆ క్షణమంతయు మధురము
నా క్షణమంతయునమరము నాతమకంబున్
ఆ క్షణమందినసుఖమును
నా క్షణమును మరువటయునసాధ్యముదార్లా!
కనులన్నితెరచియున్నను
కనపడదేమియు నొకరికొకరుతప్ప మరే
మనలేరేవ్వరు జంటను
పనులెన్నిజరగవలసిన పట్టవు కదరా!
-దార్ల వెంకటేశ్వరరావు
18 ఏప్రిల్ 2018
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి