"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

02 మార్చి, 2018

దార్ల కాశీయాత్ర -2 (రైలు ప్రయాణం)


సికిందరాబాద్ నుండి వారణాసికి దానాపూర్ ఎక్స్ ప్రెస్ ఒక్కటే ఉంది. దానితో దానికి చాలా డిమాండ్ ఉంది. కనీసం నెలరోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకుంటేతప్ప బెర్త్ దొరకడం కష్టం. మేము కూడా అలాగే నెలరోజుల ముందే రిజర్వేషన్ చేయించుకున్నాం. అయినా సీటులు దొరకలేదు. వెయిటింగ్ లిస్ట్ 115 వచ్చింది. అది మేము వెళ్ళే ముందురోజుకి RAC  అయ్యింది. కానీ బెర్త్ లేకపోతే కష్టమని మరలా తత్కాల్ (ప్రీమియర్) లో ట్రై చేయించాం.ప్రయివేట్ ఏజెన్సీవాళ్ళ దగ్గర టికెట్స్ మళ్ళీ బుక్ చేయించాం. ఏసి దొరకలేదు. మరలా స్లీపర్ మాత్రమే దొరికాయి. అవైనా దొరికినందుకు సంతోషించాం. కానీ, ట్రైన్ నిండా జనం. జనరల్ టికెట్ తీసుకున్నవాళ్ళు కూడా వాళ్ళిష్టమైన సీటులో కూర్చొన్నారు. అడగడానికి లేదు.లోన ఉక్కిరి బిక్కిరి. బయట ఎండ. కూర్చోవడానికి కూడా చోటులేనిపరిస్థితి. పైగా కాశీకి వెళ్ళే భక్తులు ఒకరిమీద మరొకరు కలబడుతూ కొట్టుకోవడం.... తిట్టుకోవడం... ఇవన్నీ చూసిన తర్వాత ఇలా రాసుకున్నాను.
లే చుక్కలు చూచితి
బగ మండుచునుయెండ యమేపెట్టన్
డా లాడుచు భక్తులు
వారునువోలెకాశి యనముసాగన్
            కొంతదూరం పోయిన తర్వాత కాస్త సీటు దొరికింది. ఇంటిదగ్గర చేసిన పులిహోర తిన్నాం. ఆత్మారాముడు కొంచెం శాంతించాడు. పైన పడుకుని రెండు పద్యాలు రాసుకున్నాను.

చింత పండు పులుసు చిటికెడ పసుపును
జీడి పప్పు కాస్త జీల కర్ర
వేరు శనగ మొదలు వేయవలసినంత
పుష్కలంబు రుచియె పులియ హోర !

రుచిగా కుదరిందనుచూ
చుడేవచ్చిన వదలను మ్మనియమృతమ్
రుచులే చెప్ఫుచు మంజుకి
శుచిగానున్నపు లిహోర సుష్టుగ తింటిన్
స్లీపర్ పరిస్థితి మాత్రమే ఇలా లేదు. ఏసీ చేయించుకున్నవాళ్ళ పరిస్థితీ అలాగే ఉంది. దీన్నిలా వర్ణిస్తూ ఒకపద్యం రాశాను.


సీగీసీచెల్లదు
టీసీ వచ్చిన నుపోవు టిచ్చటి రీతే
మూసీ మూయగకనులను
తీసే వచ్చును తలుపులు తిప్పుచునెవరో! 
మధ్యమధ్యలో రకరకాల చిరు తిండ్లు తింటూ, కాఫీ, టీలు తాగులూ ఎలాగైతై 19 ఫిబ్రవరి 2018 సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వారణాసికి చేరుకున్నాం.

ఈ లోపు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థిని సునీత ఫోను చేసింది. ‘‘మిమ్మల్ని నేను రిసీవ్ చేసుకుంటాను సర్. సార్ మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకురమ్మన్నారు’’ అని చెప్పింది. వారణాసి స్టేషన్ దిగి ఆమె కోసం ఎదురుచూస్తుంటే, రాజేష్ అనే రీసెర్చ్ స్కాలర్ ఫోను చేశాడు. తాను వచ్చానని చెప్పాడు. ఆటో ఎక్కించుకొని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం యూనివర్సిటి గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళాడు. స్టేషన్ దగ్గర రెండువందలు చెప్పిన ఆటోవాడు. రెండువందల ఏభై చెప్పానని అబద్దం ఆడాడు. సరేనని ఇచ్చేశాను. వారణాసిలో అడుగుపెట్టిన దగ్గరనుండీ ఏదో ఉద్విగ్నత అనిపించింది.

          శ్రీకాశీవిశ్వేశ్వరపేరు బోర్డు మీద కనిపించింది. వెంటనే అదే పేరుతో పద్యం ప్రారంభించాను. కానీ దాన్ని వెంటనే పూర్తి చెయ్యలేకపోయాను. గెస్ట్ హౌస్ కి వెళ్ళిన తర్వాత ఆ పద్యాన్ని పూర్తి చేశాను. ఆటోలో ఉండగానే మాత్రం కాశీ జాగ్రత్తగా చేరానని ఒక పద్యం అలవోకగా వచ్చేసింది.
చేరితినయ్యా కాశీ
కోరి కొలువగ గణపతిని కోరితి మొదటన్
హాతినందితినది కను
లాగ దర్శించి నిన్ను మ్మను వేడన్

కామెంట్‌లు లేవు: