హైదరాబాదు, నారాయణగూడలో
గల బాబూజగజ్జీవనర్ రామ్ ప్రభుత్వ డిగ్రీకళాశాల (BJR Govt.Degree College)లో 27 ఫిబ్రవరి 2018 వతేదీన
ఒకరోజు జాతీయ సదస్సుజరిగింది. దీనికి తెలుగుశాఖ అధ్యక్షుడు డా.కృష్ణమూర్తి సదస్సు
సంచాలకులుగా వ్యవహరించారు. తొలిసమావేశానికి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్యుడు, తెలుగుశాఖ, డిప్యూటి
డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్, యూనివర్సిటి
ఆఫ్ హైదరాబాదు వారు వ్యవహరించారు.
ఈ సమావేశానికి డా.మహంతయ్య సమావేశకర్తగా
వ్యవహరించారు. సదస్సులో డా.కాలువ మల్లయ్య, డా.ఏ.కె.ప్రభాకర్,
డా.పద్మ, శ్రీ స్కైబాబా పత్రాలను సమర్పించారు.
సభాధ్యక్షత వహించిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడారు.
‘‘ తెలుగులో
కథాసాహిత్యం గురజాడ అప్పారావు ‘దిద్దుబాటు’(1910) అని
కొందరూ, ఆచంట సాంక్యాయనశర్మ ‘లలిత’
అని మరికొందరు, బండారు అచ్చమాంబ దంపతుల ప్రథమ కలహము (హిందూసుందరి,
1902 జూన్) ‘స్త్రీవిద్య’
(1902), ధనత్రయోదశి,(1902) నవంబరు 'హిందూసుందరి' పత్రికల్లో ప్రచురించిన వాటిలో ఒకటనీ
అంటున్నవాళ్ళున్నారు.
మా మిత్రుడు డా.కె.కృష్ణమూర్తి
ఈ సదస్సుని ‘తెలుగుకథాసాహిత్యం: చర్చనీయాంశాలు’ అని పెట్టడమే ఈ సదస్సు
విద్యార్థినీ, విద్యార్థులకు, సాహిత్య వేత్తలకు ఉపయోగపడాలనే ఆలోచన కనిపిస్తుంది.
అందుకనే నేడు అందరూ చక్కడా తెలుగు కథాసాహిత్యంలో వివిధ ‘చర్చనీయాంశాలు’గా మారిన వాటిని
అన్నింటినీ చర్చిస్తున్నారు. తొలితెలుగు కథానిక పై వస్తన్న చర్చ కూడా ఇదే.
తెలుగులో వస్తుపరంగాను, శిల్పపరంగానూ
కథానికాసాహిత్యం ఎంతో వైవిధ్యాన్ని ప్రదర్శించింది. సంస్కరణవాదం, అభ్యుదయ, విప్లవ,
స్త్రీవాద, దళిత ఉద్యమాల ప్రభావం మాత్రమే కాకుండా, ముస్లిం మైనారిటీ వాదం,
క్రిష్టియన్ మైనారిటీవాదం, ప్రాంతీయ అస్తిత్వం వంటి వాటితో పాటు డయాస్పోరా
కథాసాహిత్యం కూడా వస్తోంది. మరోవైపు ప్రపంచీకరణ సాహిత్యం కూడా వస్తుంది. వీటిని
లోతుగా చర్చించుకోవాలి. నిష్ణాతులైన వారు ఈ సమావేశంలో పత్రాలను సమర్పిస్తున్నారు.
వాటిని వినడం ద్వారా కొత్త ఆలోచనలు వస్తాయి.
ఈ సభలో డా.పత్తిపాక మోహన్, డా.పసునూరి
రవీందర్ వంటి ప్రముఖ సాహితీ వేత్తలున్నారు. వీరంతా మాట్లాడతారు. ఈ సమావేశం ఫలవంతం
కావాలని ఆకాంక్షిస్తున్నాను. చివరిలో నేను డయాస్పోరా కథాసాహిత్యం గురించి
పత్రసమర్పణ చేస్తాను.’’ అని చెప్పి, ఒక్కొక్క పత్రాన్ని జాగ్రత్తగా విశ్లేషించారు.
చివరిలో తన పత్రాన్ని కూడా సమర్పించారు.
విద్యార్థినీ,
విద్యార్ధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి