ప్రాణవాయువునిచ్చేవి
పచ్చని మొక్కలే: ఆచార్య తుమ్మల రామకృష్ణ
మొక్కల్ని పెంచుకోవడం
అంటేనే పరిశుభ్రతను పాటించడం. మనిషికి కాలసిన జీవశక్తి మొక్కల్నించి మనం పొందుతాం.
ఒకమనిషి తన జీవిత కాలంలో కనీసం కొన్ని మొక్కల్నైనా పెంచాలి. అప్పుడే మనం ఈ ప్రకృతి
కి కొంత ఇవ్వగలిగినవాళ్ళమవుతాం. ప్రకృతి మనకెన్నో ఇచ్చింది. మన చుట్టూ ఈ ప్రకృతే
లేకుంటే మానవ మనుగడ కష్టం అని ఆచార్య తుమ్మల రామకృష్ణ పేర్కొన్నారు.
స్వచ్ఛతా పక్షోత్సవాల్లో భాగంగా ముఖ్య అతిథిగా
పాల్గొన్న తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య తుమ్మల రామకృష్ణ ఆదివారం (2 సెప్టెంబర్
2017) హైదరాబాదు విశ్వవిద్యాలయం, దక్షిణ ప్రాంగణం (South Campus)లో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే
కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొక్కల్ని పెంచడం వల్ల మనలో మానసికానందం కూడా
కలుగుతుందని స్వచ్ఛతా పక్షోత్సవ కమిటీ చెర్మన్, డిప్యూటి డీన్, స్టూడెంట్స్
వెల్ఫేర్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అన్నారు.
పరిశోధక విద్యార్థులు
జి.కృష్ణవేణి, చిట్టెమ్మ, షాలిని, ఎం.ఏ. ఇంటిగ్రేటెడ్ విద్యార్థినీ విద్యార్థులు
పాల్గొని ఒక్కొక్క మొక్కను నాటారు. తాము కూడా మొక్కల్ని నాటే కార్యక్రమంలో భాగస్వాములు
కావడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. జూనియర్ హార్టీకల్చరిస్ట్ శ్రీ సుబ్బారావు
ఆధ్వర్యంలో మరికొన్ని మొక్కల్ని నాటించేకార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్,
యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు ప్రొఫెసర్ దేవాశిస్ ఆచార్య, స్వచ్ఛతా పక్షోత్సవ కమిటీ
కన్వీనర్, హార్టీ కల్చర్ & శానిటేషన్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీ బి. చంద్రశేఖర్, డైరెక్టర్,
ఫిజికల్ ఎడ్యుకేషన్ డా. కె.వి. రాజశేఖర్, శ్రీ గణపతి, శ్రీ భాస్కర్, విద్యార్థినీ
విద్యార్థులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి