ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని సన్మానించిన రాజనీతిశాస్త్రవేత్తల బృందం... అసలు విషయం ఏమిటంటే, రాజనీతి శాస్త్ర పారిభాషిక(త్రిభాషా)పదకోశాన్ని భారత ప్రభుత్వం తయారు చేయిస్తోంది. దీనిలో నన్ను తెలుగు సభ్యుడిగా తీసుకున్నారు. మొదటి కార్యశాల జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో జరిగింది. అప్పుడు నేను అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉన్నాను. మరలా రెండవ కార్యశాల యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదులో జరిగింది. ఇప్పుడు నాకు పదోన్నతి లభించింది. ప్రొఫెసర్ అయ్యాను. దీనితో పాటు డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ అయ్యాను. మా డిపార్టుమెంటు, మా యూనివర్సిటి కాకపోయినా నా అభివృద్ధిని చూసి వాళ్ళెంతగానో మురిసిపోయారు. మరిన్ని ఉన్నతపదవులు అధిష్టించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఘనంగా నన్ను సత్కరించారు. వారి సత్కారాన్ని నిరంతరం గుర్తు చేసుకునే పనిలో భాగమే ఈ పోస్ట్. మీ అందరికీ ధన్యవాదాలు.
కార్యశాలలో పాల్గొన్న ఒక ఫోటో
కార్యశాల జరుగుతున్న రోజుల్లోనే ఒకరోజున ఉర్దూ విశ్వవిద్యాలయం ప్రొ.వైస్ ఛాన్సలర్ గారింటిలో విందు సందర్భంగా తీసుకున్న ఫోటో.
మీ సహృదయ సత్కారానికి
నా హృదయపూర్వక కృతజ్ఞతలు
అరమరికల్లేని
మీ పలకరింపుల పరిమళాల్ని
నా ఎదగదుల్లో
చిరకాలం
చిగురింపజేసుకుంటూ...
మీ
దార్ల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి