"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

27 ఆగస్టు, 2017

దశాబ్దిన్నర మా వివాహ వార్షికోత్సవ విశేషాలు

మాకు పెళ్ళై ఈ యేడాదికి పదిహేను సంవత్సరాలు.
మా పెళ్ళయ్యే నాటికి ఆంధ్ర, తెలంగాణ ఫీలింగ్ ్స మాకు తెలియవు
తెలుగువాళ్ళగానే ఒక్కటయ్యాం.
అదృష్టం కొద్దీ నాకు సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగం
ఆమెకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వంలో కొలువు
ఇప్పుడు మాది హైదరాబాదు
హైదరాబాదులోనే స్థిరనివాసం
హైదరాబాదులోనే సొంతిల్లు
మా సుఖదు:ఖాలన్నీ ఇక్కడే
మా ఆనందోత్సాహాలన్నీ మా విద్యార్థులతోనే
అందుకేనేమో
ఈ యేడాది మా విద్యార్థులు
మా వివాహవార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
మాకు చెప్పకుండానే
‘ఆ రోజు మాత్రం మాకివ్వండ’న్నారు
ఇద్దరం సెలవుపెట్టాం.
ఇంటిదగ్గరెప్పుడూ ఏదొకటి చేస్తుంటారు కదా
అలాగే చేస్తారేమో అనుకున్నాం’.
కానీ ముందురాత్రే వచ్చేశారు.
టూర్ ప్లాన్ చేశారు.
ఆలంపూర్ జోగులాంబ దేవాలయానికి తీసుకెళ్ళారు
ఆ తర్వాత మహానంది చూపించారు
వచ్చేటప్పుడు యాగంటి ఉమామహేశ్వర్లుని దర్శింపచేశారు
సగం దూరం వచ్చేసరికి అప్పటికే సిద్దం చేసుకున్న కేక్  బయటకుతీసారు
మా మ్యారేజ్ రోజుకి మర్నాడే మా ఆవిడ పుట్టినరోజు
‘‘ఎంత ప్లాన్ గా మ్యారేజ్ డే ని ఫిక్స్ చేశావ్...
ఆంధ్రావాళ్ళం అమాయకులం కదా’’ అని
అప్పుడప్పుడూ దాన్ని గుర్తు చేస్తూ ఆమెను టీజ్ చేయడం అదో సరదా
చాలా థ్రిల్ గా
హైవే రోడ్డు పక్కనే
ఒకడాబా దగ్గర ఆపి కేక్ కట్ చేయించారు.
చాలా హోమ్లీగా , అనూహ్యంగా చే శారు.
మహానందిస్నాన ఘట్టంలో జలకాలాటలతో
మేము మరిచిపోలేని జ్ఞాపకాల దృశ్యాన్నిచ్చారు.
మేము ఈ ఇంటిలోకి వస్తూ (గృహప్రవేశంచేస్తూ )...
నాబ్లాగులో అప్పుడు ఇలా రాశాను.
‘‘పిల్లలే కదా... 
వాళ్ళకోసమే ఎదురు చూస్తున్నాం... 
ఇల్లంతా హడావిడి చేయాలంటే వాళ్ళే కదా కళా కాంతులు... 
అంత వరకూ మా విద్యార్థులే మా పిల్లలు.... మా వెలుగులు!’’ అని రాశాను. 
అప్పుడుూ...  విద్యార్ధులే గృహప్రవేశంలో హడావిడి చేశారు. 
ఆ పోస్టుకి మురిసిపోయిన చాలా మంది 
నాకు వ్యక్తిగతంగా మెయిల్స్ రాశారు. 
మరికొంతమంది వ్యక్తిగతంగా ఫోనులు చేశారు. 
ఆస్ట్రేలియా నుండి ఒక తెలుగు రచయిత్రి, అధ్యాపకురాలు ఎంతో ఆత్మీయతతో మెయిల్ పెట్టారు.
ఇవన్నీ గుర్తుకొస్తుకొస్తున్నాయి. 
పదిహేనేళ్ళ ప్రయాణాన్ని మరోసారి రాస్తాను. 
అంతవరకూ 
ఈ దృశ్యాల్ని అదృశ్యం కాకుండా మదిలో దాచుకోవాలనుకుంటున్నాను.





























కామెంట్‌లు లేవు: