"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

16 ఆగస్టు, 2017

బెంగుళూరు విశ్వవిద్యాలయం సందర్శనం

 బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగుళూరు, జ్ఞానభారతి లో  గల తెలుగుశాఖకి ఈ నెల 12వతేదీ (12 ఆగస్టు 2017) న వెళ్ళాను. తెలుగుశాఖలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యునిగా  ఎం.ఏ., తెలుగు సిలబస్ రూపకల్పనలో భాగంగా వెళ్ళాను. అక్కడ తెలుగుశాఖాధ్యక్షురాలుగా ఆచార్య కె.ఆశాజ్యోతిగారున్నారు. నాతో పాటు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారు కూడా ఒక సభ్యుడిగా పాల్గొన్నారు. మేము వెళ్ళేటప్పటికే సిలబస్ ముసాయిదా కాపీని సిద్ధంగా ఉంచారు. తెలుగుశాఖలో శాఖాధ్యక్షుల వారి హాలు చాలా ఆకర్షణీయంగా అనిపించింది. శాఖాధ్యక్షులు ఆచార్య ఆశాజ్యోతిగారు ఆత్మీయమైన పలకరింపు, ఆతిథ్యం, కొత్తగా వారు ప్రచురించిన పుస్తకం ఇచ్చారు. వారే స్వయంగా అతిథి గృహానికి వచ్చి పలకరించారు. మళ్ళీ వారే వచ్చి డిపార్టుమెంటుకి తీసుకెళ్ళారు. కంప్యూటర్ విజ్ఞానాన్ని కూడా తెలుగువాళ్ళకి పరిచయం చేస్తూ చక్కని ఒక పాఠ్యాంశాన్ని రూపకల్పన చేశారు. అలాగే సంప్రదాయ, ఆధునిక, జానపద, భాషాశాస్త్రం, వ్యాకరణం, ఆధునిక ఉద్యమాలు, ధోరణులకు సంబంధించిన అనేకాంశాల్ని విద్యార్ధులు నేర్చుకునేవిధంగా ఎంతో దార్శనిక దృష్టితో పాఠ్యాంశాల్నిరూపకల్పన చేస్తున్నారనిపించింది. తెలుగుశాఖలో ప్రత్యేకించి ఒక గ్రంథాలయంతో పాటు, పరిశోధక విద్యార్థులు కూర్చోవడానికి ప్రత్యేకంగా ఒక గది, ఆఫీసు గది వేర్వేరుగా ఉన్నాయి. వీటితో పాటు గెస్ట్ ఫ్యాకల్టీకి ప్రత్యేక గదులున్నాయి. మేము అక్కడుండగా కొంతమంది విద్యార్థులు వచ్చి పాఠ్యాంశాల్లోని పాఠాలు కావాలంటే, వెంటనే జిరాక్స్ చేసుకోమని ఇవ్వడం ఆచార్య ఆశాజ్యోతిగారి అంకితభావానికి నిదర్శనంగా కనిపించింది. ఈ తెలుగుశాఖ మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను. మా ఇంటిలోని మా కుటుంబసభ్యురాలితో గడిపినంత ఆనందమనిపించింది. గెస్ట్ హౌస్ లో పెట్టిన దోసెలు చాలా బాగున్నాయి. అలాగే, ఆచార్య కె.ఆశాజ్యోతిగారు మాకు ఏర్పాటు చేసిన భోజనం కూడా  అదిరింది.

 ఫోటోలో వరుసగా నేను,ఆచార్య కె.ఆశాజ్యోతి, డా. ఎం.మంజుశ్రీ,ఆచార్య మేడిపల్లి రవికుమార్ గార్లు ఉన్నారు.
 ఫోటోలో వరుసగా మా విద్యార్థి ఎం. చంద్రమౌళి,  నేను,ఆచార్య కె.ఆశాజ్యోతి, డా. ఎం.మంజుశ్రీ,ఆచార్య మేడిపల్లి రవికుమార్ గార్లు ఉన్నారు. 

కామెంట్‌లు లేవు: