రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు


నిన్న పడమరకు
వీడ్కోలు పలికిన ప్రచండ భానుడు
నేడు బాలభానుడై
తూర్పున ఉదయించాడు

నిన్నటికి కనపడని  ఆశల దారేదో
నేటినుండి  కొత్త వెలుగునిస్తానంటూ
వాగ్ధానమిస్తూ
నిరీక్షించ మంటోంది

అడుగులు నేర్చుకుంటున్న
మనవడి చేతులు పట్టుకొని
జీవితాన్వేషణలోని రహస్యాన్నేదో నేర్పూతూ తాత
పూర్ణానుస్వరాన్ని దిద్దిస్తున్నాడు

నేనేమో
తాతేసిన అనుభవాల తొడుగునీ
నాకొడుకేసే తొలి అడుగునీ
కలుపుతూ
నూతన సంవత్సారానికి స్వాగతం పలుకుతున్నాను
- దార్ల వెంకటేశ్వరరావు
************************************************
Dr.Darla Venkateswara Rao
Associate Professor, Department of Telugu
School of Humanities,UNIVERSITY OF HYDERABAD
Hyderabad. Telangana State,India

No comments: