హైదరాబాదు విశ్వవిద్యాలయం, ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం వారం రోజుల ( 7 మార్చి 2016 నుండి 12 మార్చి 2016) పాటు ‘ప్రాచీన తెలుగు సాహిత్యం-పరిణామ వికాసం’ పేరుతో జాతీయ శిక్షణాశిబిరాన్ని స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ కాన్ఫరెన్సు హాలు, హైదరాబాదు విశ్వవిద్యాలయం, హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. ప్రాచీన తెలుగు సాహిత్యంలోని విశిష్టాంశాలను పరిశోధకులు, విద్యార్థులు, అధ్యాపకులు గుర్తించడానికి వీలుగా ఈ కార్యశాల (వర్క్ షాప్)ని ఉద్దేశించారు. కార్యశాల సంచాలకులు, ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం హెడ్, కోర్డినేటర్ ఆచార్య జి.అరుణకుమారి కార్యశాల లక్ష్యాలను తెలియజేశారు. కార్యశాల ప్రారంభ సభకు తెలుగుశాఖ అధ్యక్షుడు ఆచార్య తుమ్మల రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న హైదరాబాదు విశ్వవిద్యాలయం ఇన్ చార్జి వైస్ ఛాన్సలర్ ఆచార్య పెరియా సామి ప్రారంభించారు. డా.దార్ల వెంకటేశ్వరరావు అతిథులను ఆహ్వానించారు. ఆత్మీయ అతిథిగా డీన్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ ఆచార్య పంచానన్ మోహంతీ పాల్గొన్నారు. విశిష్టఅతిథిగా ఆచార్య అనుమాండ్ల భూమయ్యపాల్గొన్న ఈ సభలో ఆచార్య కొలకలూరి ఇనాక్ కీలకోపన్యాసం చేశారు.
ఆహ్వాన పత్రం
ఆహ్వానం పలుకుతున్న డా. దార్ల వెంకటేశ్వర రావు గారు
ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం హెడ్, కోర్డినేటర్ ఆచార్య జి.అరుణకుమారి గారు కార్యశాల లక్ష్యాలను తెలియజేశారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న హైదరాబాదు విశ్వవిద్యాలయం ఇన్ చార్జి వైస్ ఛాన్సలర్ ఆచార్య పెరియా సామి గారు
సభాధ్యక్షుడు ఆచార్య తుమ్మల రామకృష్ణ గారు
వర్క్ షాప్ లక్ష్యాలను వివరిస్తున్న ఆచార్య జి. అరుణ కుమారి గారు
విశిష్టఅతిథిగా ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారు
ఆత్మీయ అతిథిగా డీన్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ ఆచార్య పంచానన్ మోహంతీ గారు
ఈ సభలో ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు కీలకోపన్యాసం చేశారు. మూర్తిదేవి పురస్కారం వచ్చిన సందర్భంగా ఆయనను సత్కరించారు.
వర్క్ షాప్ లో పాల్గొన్న అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి