‘తెలుగునాట ప్రసిద్ద కవి పండిత కుటుంబాలు- సాహిత్య సేవ’ అనే అంశంపై నా పర్యవేక్షణలో పరిశోధన చేసిన Prabhakar Boinepally గారి పిహెచ్.డి. బహిరంగ మౌఖిక పరీక్ష 11 మే 2016 వతేదీన తెలుగు డిపార్టుమెంటు సమావేశ మందిరంలో ఉదయం గం.11-30 నిమిషాలకు జరిగింది. పరీక్షకులుగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ప్రొఫెసర్ గోగినేని యోగప్రభావతిదేవి గారు వచ్చారు.పలువురు పరిశోధక విద్యార్థినీ విద్యార్థులు ఈ మౌఖిక పరీక్షలో పాల్గొన్నారు. మౌఖిక పరీక్ష అనంతరం Prabhakar Boinepallyగార్కి డాక్టరేట్ పట్టా ఇవ్వవచ్చని హైదరాబాదు విశ్వవిద్యాలయం వార్కి కమిటీ సిఫార్సు చేసింది. ఈ సందర్భంగా Prabhakar Boinepally గార్కి పలువురు అధ్యాపకులు, పరిశోధకులు శుభాకాంక్షలు తెలిపారు. నేను కూడా
Prabhakar Boinepally గార్కి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే భవిష్యత్తులో కూడా ఈ రంగంలో విశేషమైన కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాను...డా.దార్ల వెంకటేశ్వరరావు
తన పరిశోధనాంశాన్ని వివరిస్తున్న Prabhakar Boinepally, వేదికపై తెలుగుశాఖాధ్యక్షులు, మౌఖిక పరీక్ష కమిటీ అధ్యక్షులు ఆచార్య తుమ్మల రామకృష్ణ,పరీక్షకులుగా విచ్చేసిన ఆచార్య గోగినేని యోగప్రభావతీదేవి పరిశోధన పర్యవేక్షకులు డా.దార్ల వెంకటేశ్వరరావు ఉన్నారు.
పరీక్షిస్తున్న ఆచార్య గోగినేని యోగప్రభావతీదేవిగారు
బహిరంగ మౌఖికపరీక్షలో పాల్గొన్న అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థినీ విద్యార్థులు
(ఫోటోలు: బడిగె ఉమేశ్ సౌజన్యంతో...)
2 కామెంట్లు:
ప్రియమైన తమ్ముడు-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
హృదయ పూర్వక ధన్యవాదాలు దార్ల గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి