"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

21 ఏప్రిల్, 2016

My Account was Hacked - నా ఎకౌంట్ హేకింగ్ చేశారు...ఒక విజ్ఞప్తి!!

ప్రియమైన పాఠకులకు, నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు, నాతో అధికారిక ఉత్తరప్రత్యుత్తరాలను నిర్వహించేవారందరికీ ఒక విజ్ఞప్తి.

ఈ నెల 17వ తేదీన సుమారు సాయంత్రం 3 గంటలనుండి రాత్రి పన్నెండు గంటల వరకు నా ఈమెయిల్  (vrdarla@gmail.com)ని ఎవరో హేక్ చేశారు. అందు వల్ల నా ఎక్కౌంట్ ని ఆ సమయంలో నేను ఉపయోగించలేదు. ఒక్కసారిగా జరిగిన ఈ హఠాత్పరిణామానికి షాక్ అయిన నేను తర్వాత కొన్ని గంటలకు మరలా పునరుద్దరించుకున్నాను. గూగుల్ వారు ప్రకటించిన కారణాన్ని బట్టి నా మెయిల్ ని ఎవరో హేక్ చేశారని అర్థమయ్యింది. అంతే కాకుండా vrdarla@gmail.com పేరుతో ఎవరైనా పైన పేర్కొన్న సమయంలో మీకేదైనా మెయిల్ వస్తే దాన్ని నా ఈ మెయిల్ గా పరిగణించవద్దని మనవి చేస్తున్నాను. త్వరలోనే నా సిస్టమ్ ఫార్మేట్ చేసి, ఏంటీ వైరస్ పెట్టిన తర్వాత మళ్ళీ నేను ఒక కొత్త ఈ మెయిల్ ఐడీని క్రియేట్ చేయించుకొని, మీకు అందరికీ విడివిడిగా ఈ విషయాన్ని తెలియజేస్తాను. అంతవరకు నాకు vrdarla@gmail.com ఐడి కి ఎవరూ ఎలాంటి సమాచారాన్ని పంపించవద్దనీ, ఈ ఐడీతో వచ్చే ఈమెయిల్స్ కి స్పందించవద్దనీ విజ్ఞప్తి చేస్తున్నాను. 
మీ
డా.దార్ల వెంకటేశ్వరరావు

కామెంట్‌లు లేవు: